వెంకీమామ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే ?

వెంకీమామ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే ?
x
Highlights

టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం వెంకీమామ.. వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్ళుగా నటించారు.

టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం వెంకీమామ.. వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్ళుగా నటించారు. నిజజీవితంలో మామఅల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగచైతన్య ఈ సినిమాలో కూడా అవే రోల్స్ ప్లే చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని డిసెంబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

అయితే తాజాగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయిందని తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వెంకీమామ సినిమా 27.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అదే విధంగా కేరళ, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 2.7 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో 2.8 కోట్లు, ఇక మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. 33.1 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది.

ఇక ఏరియా వైస్ రిపోర్ట్ చూసినట్లయితే.. నైజాంలో 7.5 కోట్లు, సీడెడ్‌లో 5.4 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.6 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 2.4 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2 కోట్లు, గుంటూరులో 3 కోట్లు, కృష్ణాలో 2.4 కోట్లు, నెల్లూరులో 1.3 కోట్ల మేర ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా 34 కోట్ల టార్గెట్‌తో వెంకీమామ బరిలోకి దిగుతోంది.

ఈ సినిమాకి బాబీ ( కే. యస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories