వెంకీమామలో డిలిట్ చేసిన సీన్ ఇదే

వెంకీమామలో డిలిట్ చేసిన సీన్ ఇదే
x
Venky Mama Deleted Scene
Highlights

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం వెంకీమామ.. డిసెంబర్ 13 న రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది....

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం వెంకీమామ.. డిసెంబర్ 13 న రిలీజైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. టాక్ పరంగానే కాదు. కలెక్షన్ల పరంగా కూడా వెంకీమామ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాలో నుంచి డిలిట్ చేసిన ఓ సన్నివేశాన్ని చిత్ర బృందం యుట్యూబ్ లో రిలీజ్ చేసింది.

ఆ పల్లెటూరికి కొత్తగా వచ్చిన హిందీ టీచర్ పాయల్ ని తన మామ అయిన వెంకటరత్నంని కలపాలని చూస్తాడు అల్లుడు చైతూ.. పాపం ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇక మరోవైపు రాశి, చైతూకి ఒకరంటే ఒకరికి పడదు. ఈ నేపథ్యంలో రాశి తన స్నేహితురాలిని తీసుకుని పాయల్‌ వద్దకు వెళ్లి గొడవ చేస్తుంది. అక్కడ జరిగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఈ కామెడీ సీన్‌ను కట్‌ చేసింది చిత్ర బృందం. ఈ సీన్ ని చూసి మీరు కూడా నవ్వేసేయండి.

ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మించాయి. బాబీ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories