రాజమౌళి, కొరటాల సరసన 'భీష్మ' దర్శకుడు

రాజమౌళి, కొరటాల సరసన భీష్మ దర్శకుడు
x
Highlights

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మొదటి సినిమా రావడం ఎంత కష్టమో, రెండో సినిమా విజయం సాధించడం కూడా అంతేకష్టం అయిపొయింది. మొదటిసినిమాతో మంచి హిట్ కొట్టి...

సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మొదటి సినిమా రావడం ఎంత కష్టమో, రెండో సినిమా విజయం సాధించడం కూడా అంతేకష్టం అయిపొయింది. మొదటిసినిమాతో మంచి హిట్ కొట్టి తర్వాత సినిమాతో ప్లాపులు ఇచ్చిన దర్శకులు చాలా మందే ఉన్నారు. కానీ రెండో సినిమాని కూడా మెట్టు ఎక్కించి, తమ స్థాయిని మరింతగా పెంచుకున్న దర్శకుల జాబితా మాత్రం చాలా తక్కువే ఉందని చెప్పాలి. ఇప్పుడు అలాంటి జాబితాలోకి భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల కూడా చేరిపోయాడు. త్రివిక్రమ్ శిష్యుడిగా, ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ తాజాగా నితిన్ తో భీష్మ అనే సినిమాని చేసి హిట్ కొట్టాడు. మహాశివరాత్రి సందర్భంగా నిన్న విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తొలిరోజే ఆరు కోట్లను కొల్లగొట్టింది.

రెండో సినిమాతో హిట్ కొట్టి తమ స్థాయిని మరింతగా పెంచుకున్న దర్శకుల జాబితా ఇలా ఉంది

రాజమౌళి : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హిట్ కొట్టిన రాజమౌళి మళ్ళీ అదే ఎన్టీఆర్ తో సింహాద్రి తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు.

త్రివిక్రమ్ : తరుణ్ హీరోగా నువ్వే నువ్వే సినిమాకి మొదటిసారి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ రెండో సినిమాగా మహేష్ బాబు హీరోగా అతడు సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా సెన్సేషన్ హిట్ అయింది.

కొరటాల శివ : మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల.. శ్రీమంతుడు సినిమాతో భారీ హిట్ కొట్టాడు.

బోయపాటి శ్రీను : భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి తులసి సినిమాతో మరింత హిట్ కొట్టి ఇండస్ట్రీలో మాస్ దర్శకుడిగా కొనసాగుతున్నాడు.

సంపత్ నంది : ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమై రెండో సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసి భారీ హిట్ కొట్టాడు.

అనిల్ రావిపూడి : కళ్యాణ్ రామ్ పటాస్ తో దర్శకుడిగా పరిచయమైన అనిల్ ఆ తర్వాత సుప్రీమ్ సినిమాతో హిట్ కొట్టి తన స్థాయిని పెంచుకున్నాడు.

ఇంకా ఈ లిస్టులో శివ నిర్వాణ, మేర్లపాక గాంధీ,విరించి వర్మ తదితరులు ఉన్నారు. అయితే ఇలాంటి సరసన ఇప్పుడు వెంకీ కుడుముల కూడా చేరిపోయాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories