Venkatesh Narappa: నారప్ప మూవీలో హైలైట్ ఏంటో తెలుసా?

Venkatesh Performance Highlights in Narappa
x

Venkatesh in Narappa:(The Hans India)

Highlights

Venkatesh Narappa: తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా వెంకటేష్ ‘నారప్ప’ చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది.

Venkatesh Narappa: తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాను తెలుగులో రీమేక్ లో నటిస్తోన్న సినిమా నారప్ప. ఈ సినిమలో విక్టరీ వెంకటేష్ నడిస్తుండగా.. ఆ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రోడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ ఇప్పటికే అనేక చిత్రాలను రీమేక్ చేసి సూపర్ హిట్స్ కొట్టాడు.

ఎలాంటి పాత్రలో అయినా అవలీలగా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగే వెంకీ.. ఇప్పుడు నారప్ప లో ఎలా నటించాడనే ఆసక్తి అందరిలో మొదలైంది.వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అనుకోని విధంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఇప్పటికే పలువురు నటీనటులు ఈ మహమ్మారి బారిన పడగా.. షూటింగ్స్ నిలిచిపోయాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.

కథలో పెద్దగా మార్పులు చేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా 'నారప్ప' చిత్రాన్ని రూపొందిస్తున్నారని తెలుస్తోంది. తాజా గా నారప్ప' సినిమా చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.ఇందులో ఇద్దరు పిల్లల తండ్రిగా.. మధ్య వయస్కుడి పాత్రలో వెంకటేష్ అద్భుతంగా నటించారని అంటున్నారు. వెంకీ నటన ఈ చిత్రానికి మేజర్ హైలైట్ గా నిలవనుంది. నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో హీరోయిన్ ప్రియమణి నటించింది. కొడుకు పాత్రలో 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తీక్ రత్నం నటించాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories