వెంకటేష్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. అనిల్ రావిపూడి స్పెషల్ వీడియో


వెంకటేష్ పుట్టినరోజున ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. అనిల్ రావిపూడి స్పెషల్ వీడియో
‘విక్టరీ’ వెంకటేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది
‘విక్టరీ’ వెంకటేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వెంకటేష్ దాదాపు అరగంట పాటు తెరపై కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, వెంకీ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే, వెంకటేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లింది. ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ ఏడాదిలోనే వెంకటేష్ నుంచి రెండు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయన్న మాట.
నలభై సంవత్సరాలకు పైగా సినీ ప్రయాణం సాగించినా, యంగ్ హీరోలకు పోటీగా తనదైన స్టైల్లో దూసుకుపోతూ వెంకటేష్ మరోసారి తన స్టామినాను నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ “పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన విక్టరీ వెంకీమామ గారు” అంటూ పోస్ట్ చేశారు. అలాగే వెంకటేష్ పోషిస్తున్న తాజా పాత్ర ‘మన శంకర వర ప్రసాద్’ ను తమ కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. “ఈ సంక్రాంతికి మెగాస్టార్‌తో కలిసి మీరు వెండితెరను వెలిగించాలని కోరుకుంటున్నాను” అంటూ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
అనిల్ రావిపూడి షేర్ చేసిన ఈ సర్‌ప్రైజ్ బర్త్‌డే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో దర్శకుడు–హీరో మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.
Happy birthday dearest Victory @VenkyMama garu & welcome to the family of #ManaShankaraVaraPrasadGaru 🎉❤️
— Anil Ravipudi (@AnilRavipudi) December 13, 2025
Can't wait for you to light up the screens this Sankranti along with the Megastar @KChiruTweets garu 😍#ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE.
Megastar @KChiruTweets… pic.twitter.com/8Gw9nKNCl3

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



