Top
logo

మరొక షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్న 'వెంకీ మామ'

మరొక షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్న
Highlights

గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే 'మజిలీ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు....

గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న యువ హీరో నాగచైతన్య ఈ మధ్యనే 'మజిలీ' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. సమంత, నాగచైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ఈ అక్కినేని హీరో దగ్గుబాటి సీనియర్ హీరోతో కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న 'వెంకీ మామ' సినిమాకు కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వం వహించనున్నారు.

నిజజీవితంలో కూడా మామా-మేనల్లుడు అయిన వీరు సినిమాలో కూడా అలానే కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తర్వాత మరొక షెడ్యూలు కూడా హైదరాబాద్లోనే జరగనుంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో 15 రోజుల పాటు జరగనుందని ఈ షెడ్యూల్ లో భాగంగా సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలను మరియు ఒక పాటను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, చై సరసన రాశీ కన్నా హీరోయిన్లుగా నటించనున్నారు. సురేష్ బాబు మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Next Story