వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కి రికార్డు థియేటర్లు లేవా?

* ఈ విషయంలో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

R Tripura Malini
Updated on: 11 Dec 2022 2:30 PM IST
Veerasimha Reddy and Waltheru Veeraya have no record theaters
X

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య కి రికార్డు థియేటర్లు లేవా?

Sankrathi 2023: వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా బోలెడు ఆసక్తికరమైన సినిమాలు విడుదల కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరెక్షన్లో నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి బరిలో దిగనుంది. అంతేకాకుండా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా సంక్రాంతి సమయంలోనే థియేటర్లలో విడుదల కాబోతోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత చిరంజీవి మరియు బాలకృష్ణల మధ్య సంక్రాంతి కాంపిటేషన్ క్లాస్ జరగబోతోంది.

ఈ విషయంలో అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాలకు థియేటర్ల విషయంలో కొంచెం ఇబ్బంది వస్తుందని చెప్పుకోవాలి. కోలీవుడ్ హీరోలు విజయ్ హీరోగా నటిస్తున్న వారసుడు మరియు అజిత్ నటించిన "తునివు" మరియు "కళ్యాణం కమనీయం" సినిమాలో కూడా సంక్రాంతి సందర్భంగా నే విడుదల కాబోతున్నాయి. ఇక "వారసుడు" సినిమాని నిర్మించిన దిల్ రాజు మరియు "కళ్యాణం కమనీయం" నిర్మించిన యువి క్రియేషన్స్ వారు థియేటర్ల విషయంలో రికార్డు స్థాయిలో థియేటర్లను తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో "వాల్తేరు వీరయ్య" మరియు "వీరసింహారెడ్డి" సినిమాలకి థియేటర్లు దొరకడం ఇప్పుడు కొంచెం కష్టం అయిందని చెప్పుకోవాలి. ఇక మరోవైపు డిసెంబర్లో విడుదల కాబోతున్న "అవతార్" సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా సంక్రాంతికి కొన్ని స్క్రీన్ లు ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సంక్రాంతి బరిలో మొదటిగా జనవరి 11న "తునివు" సినిమా విడుదల కాబోతోంది. ఆ తర్వాత జనవరి 12న "వారసుడు" మరియు "వీరసింహారెడ్డి" విడుదలకు సిద్ధమవుతుండగా చిరంజీవి "వాల్తేరు వీరయ్య" 13న మరియు "కళ్యాణం కమనీయం" 14వ తేదీలలో విడుదల కాబోతున్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story