Varun Tej’s VT-15 Title Glimpse: మెగా ప్రిన్స్ VT-15 టైటిల్ గ్లింప్స్ ఎప్పుడంటే అప్పుడే.. ట్వీట్‌గా మారిన అప్‌డేట్

Varun Tej’s VT-15 Title Glimpse: మెగా ప్రిన్స్ VT-15 టైటిల్ గ్లింప్స్ ఎప్పుడంటే అప్పుడే.. ట్వీట్‌గా మారిన అప్‌డేట్
x

Varun Tej’s VT-15 Title Glimpse: మెగా ప్రిన్స్ VT-15 టైటిల్ గ్లింప్స్ ఎప్పుడంటే అప్పుడే.. ట్వీట్‌గా మారిన అప్‌డేట్

Highlights

Varun Tej’s VT-15 Title Glimpse: గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఇప్పుడు తన లేటెస్ట్ ప్రాజెక్ట్‌తో అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు.

Varun Tej’s VT-15 Title Glimpse: గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఇప్పుడు తన లేటెస్ట్ ప్రాజెక్ట్‌తో అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరుణ్ తేజ్ 15వ సినిమా ‘వీటీ-15’ (VT-15). ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ హీరోయిన్ రితికా నాయక్ (Rithika Nayak) కథానాయికగా నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కాగా, తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జనవరి 19న టైటిల్ గ్లింప్స్‌ను రివీల్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా కమెడియన్ సత్యతో ఓ స్పెషల్ ప్రమోషనల్ వీడియోను కూడా విడుదల చేశారు.

ఆ వీడియోలో “నాకు ఇన్ని డైలాగులు ఎందుకు?” అంటూ సత్య ఆందోళన పడుతూ కనిపించడం ప్రేక్షకులను నవ్విస్తుంది. అలాగే కొరియన్ భాషలో ఉన్న డైలాగ్‌ను చూసి నిజంగా కొరియన్లకే వీడియో కాల్ చేసే సన్నివేశం మరింత ఫన్నీగా మారింది.

ఆ తర్వాత వరుణ్ తేజ్ ఫోన్ చేసి ఆ డైలాగ్ గురించి వివరాలు అడిగే సీన్‌తో వీడియో ముగుస్తుంది. మొత్తం మీద ఈ ప్రమోషనల్ వీడియో అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది.

కాగా ఈ సినిమా కథ కొరియన్ నేపథ్యంతో సాగనుండటంతో, టైటిల్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ మూవీకి మేకర్స్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories