Ram Charan Birthday: మొదలైన చెర్రీ బర్త్ డే మానియా: రామరాజు ఫస్ట్ లుక్ మరికొద్దిసేపట్లో..


సాయంత్రం 4 గంటలకు రామరాజు ఫస్ట్ లుక్ రిలీజ్ (ఫొటో ట్విట్టర్)
Ram Charan Birthday: రేపు(శనివారం) రామ్‌చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
Ram Charan Birthday: రేపు(శనివారం) రామ్‌చరణ్ బర్త్‌డే. ఈ సందర్భంగా రాంచరణ్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. RRR సినిమాలో రామ్‌చరణ్ సినిమా పోస్టర్లను, స్టిల్స్‌ను షేర్ చేసుకుంటూ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కోసం సాయిధరమ్ తేజ్ రిలీజ్ చేసిన కామన్ డీపీ అంతంత మాత్రంగానే ఉండటంతో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో వారిని కూల్ చేసేందుకు మెగా హీరో వరుణ్ తేజ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశాడు.
ఇందులో నిప్పుల మధ్యలో నుంచి దూకుతున్న సింహంలా కనిపించాడు మెగా హీరో రాంచరణ్. ఆర్‌ఆర్‌ఆర్‌లో నిప్పుకు ప్రతీకగా చెర్రీని చూపించడంతో మోషన్ పోస్టర్‌లో కూడా నిప్పునే మెయిన్ గా ఎంచుకున్నారు. డీపీ కంటే ఈ వీడియో వంద రెట్లు నయమంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా వుంటే చరణ్ ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్) సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇందులో ఆలియా సీతగా కనిపిస్తుంది. చెర్రీ బర్త్‌డేను పురస్కరించుకుని ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వనుంది టీం. అందులో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు రామరాజు లుక్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Here is the animated motion poster of @AlwaysRamCharan Anna's by his beloved fans celebrating his birthday..
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) March 26, 2021
Looks superb!!🔥🔥🔥#RCBdaySplMotionPoster pic.twitter.com/Jbu7DS8fGm

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



