వరుణ్ తేజ్ 'గని' కోసం అంత బడ్జెట్ ఎందుకు?

Varun Tej Ghani Movie has a Budget of 50 Crores | Telugu Movie News
x

వరుణ్ తేజ్ ‘గని’ కోసం అంత బడ్జెట్ ఎందుకు?

Highlights

*వరుణ్ తేజ్ ‘గని’ కోసం అంత బడ్జెట్ ఎందుకు? (

Varun Tej Movie Budget: ఈమధ్యనే గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి హిట్ ను అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు "గని" అనే ఒక స్పోర్ట్స్ డ్రామా తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 50 కోట్లు అని తెలుస్తోంది. చిత్ర దర్శకుడు కిరణ్ కొర్రపాటి చాలా కాలంగా ఇండస్ట్రీలో వున్నారు కానీ దర్శకుడిగా మాత్రం ఇదే ఆయనకి తొలి సినిమా.

మొదటి సినిమా డైరెక్ట్ చేస్తున్న ఒక దర్శకుడిని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం ఈ మధ్య కాలంలో జరగలేదు. పైగా ఈ సినిమాలో ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నదియా వంటి స్టార్ తారాగణం ఉంది. ఇక కేవలం ఐటెం సాంగ్ కోసం తమన్నాకే కోటి రూపాయిలిచ్చారని సమాచారం.ఇక కరోనా కారణంగా సినిమాకి చాలా బ్రేకులు పడ్డాయి. ఫారిన్ నుంచి బాక్సరలని పిలిపించి అన్నపూర్ణలో సెట్ కూడా వేశాక వరుణ్ కి గాయం కావడంతో షూటింగ్ రద్దు అయింది.

ఇలా చాలా కారణాల వల్ల డబుల్ బడ్జెట్ అయ్యింది. ఇలా పెరుగుతూ పెరుగుతూ చిత్ర బడ్జెట్ యాబై కోట్లకి చేరిపోయింది. వరుణ్ తేజ్ సినిమాల్లో కూడా ఇదే హయ్యెస్ట్ బడ్జెట్. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పర్లేదు కానీ ఈ మాత్రం తేడా కొట్టినా మాత్రం తీవ్ర నష్టాలు వస్తాయి. అయితే రూ. 50కోట్లు తిరిగి రావాలంటే 'గని' వరుణ్ కెరీర్లోనే అతి పెద్ద హిట్ అవ్వాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories