Top
logo

Varun Sandesh: వరుణ్ సందేశ్ షాకింగ్ లుక్

Varun Sandesh New Movie Induvadana First Look Poster launched
X

ఇందువదన ఫస్ట్ లుక్

Highlights

Varun Sandesh: హ్యాపీ డేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ ఇందువదన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Varun Sandesh: హ్యాపీ డేస్ సినిమాతో సినీ ప్రపంచానికి పరిచయం అయి ... కొత్త బంగారు లోకం సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందుకుని క్రేజీ హీరోగా మారిపోయారు వరుణ్ సందేశ్. తాజాగా ఈయన ఇందువదన సినిమాతో వస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో MSR దర్శకత్వం వ‌హిస్తున్న‌, శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు ఎమ్మెస్సార్.

విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్‌కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా,వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు.

డజన్ సినిమాలకు పైగా చేసినా కూడా ఈయన కెరీర్ పెద్దగా గాడిన పడలేదు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్-3 పుణ్యమా అని మరోసారి వరుణ్ సందేశ్ పాపులర్ అయ్యారు. చాలా రోజుల తరువాత ఇందువదన అనే టైటిల్ తో తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసాడు వరుణ్ సందేశ్. పోస్టర్ లో హీరో హీరోయిన్లు వరుణ్-ఫర్నాజ్ శెట్టి టాప్ లెస్ గా క్రేజీగా కనిపిస్తున్నారు. వరుణ్ కాస్త బాడీ బిల్డ్ చేసి, కోర మీసంతో కొత్తగా కనిపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. సెమీ న్యూడ్ స్టిల్ అయినా, కాస్త కళాత్మకంగా వుండేలా చూసుకున్నారు.

Web TitleVarun Sandesh New Movie Induvadana First Look Poster launched
Next Story