Varanasi Movie Story: ‘వారణాసి’ కథపై హింట్ ఇచ్చేసిన ప్రియాంకా చోప్రా!

Varanasi Movie Story
x

Varanasi Movie Story: ‘వారణాసి’ కథపై హింట్ ఇచ్చేసిన ప్రియాంకా చోప్రా!

Highlights

Varanasi Movie Story: 'గ్లోబల్ స్టార్' ప్రియాంక చోప్రా తాజాగా చేసిన కామెంట్స్ భారతీయ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి.

Varanasi Movie Story: 'గ్లోబల్ స్టార్' ప్రియాంక చోప్రా తాజాగా చేసిన కామెంట్స్ భారతీయ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీశాయి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, 'సూపర్ స్టార్' మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భారీ పాన్-వరల్డ్ సినిమా 'వారణాసి’ గురించి ప్రియాంక తాజాగా ఓ హాలీవుడ్ రిలీజ్ ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా కథలో టైమ్ ట్రావెల్, ప్రపంచ యాత్రలు, భారీ అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.

ప్రియాంక చోప్రా మాట్లాడుతూ...'వారణాసి మూవీ సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేసే కథ, విభిన్న కాలాల్లో జరిగే సంఘటనలు, అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న విజువల్ గ్రాండియర్. అన్ని కలిపి ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఈ సినిమాకి 14 నెలలు పాటు షూటింగ్ చేశాం. ఇంకా ఐదారు నెలలు చేయాల్సి ఉంది. రాజమౌళి సర్ కొంచెం టైం తీసుకుంటున్నారు. నటన విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. అందుకే ఎక్కువ రోజులు షూట్ చేస్తున్నాం. ప్రేక్షకులు చూసే వరకు వేచి ఉండలేం' అని చెప్పారు. వారణాసి గురించి ప్రియాంక కొన్ని కీలక విషయాలు రివీల్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇప్పటికే రాజమౌళి సినిమాలంటే విజువల్ స్పెక్టకల్ అన్న పేరు ఉంది. ఆయన గత చిత్రాల విజయాల తర్వాత ఈ కొత్త ప్రాజెక్ట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు కూడా మొదటిసారి పూర్తి స్థాయి గ్లోబల్ అడ్వెంచర్ జానర్‌లో నటించబోతుండటంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్స్ కూడా ఈ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. టైమ్ ట్రావెల్, వరల్డ్ అడ్వెంచర్, భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వారణాసి సినిమాలో కుంభ పాత్ర పోషిస్తున్నారు. ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో.. మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారుగా రూ.1200 కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories