వరలక్ష్మి శరత్ కుమార్ గొంతు గురించి అవమానించిన కోలీవుడ్ ప్రముఖుడు

*వరలక్ష్మి శరత్ కుమార్ గొంతు గురించి అవమానించిన కోలీవుడ్ ప్రముఖుడు

Rama Rao
Published on: 4 Nov 2022 4:04 PM IST
Varalaxmi Sarathkumar Talks About the Criticism She Faced for Her Voice
X

వరలక్ష్మి శరత్ కుమార్ గొంతు గురించి అవమానించిన కోలీవుడ్ ప్రముఖుడు

Varalaxmi Sarathkumar: ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ హీరోయిన్ గా కంటే విలన్ గా ఎక్కువ పాత్రలను అందుకుంటుంది ఈ భామ. ఇక తమిళ్లో మాత్రమే కాక తెలుగులో కూడా ఈమె క్రేజ్ బాగానే పెరిగింది. ఈ నేపథ్యంలో పలు భాషల నుంచి మంచి అవకాశాలను కూడా అందుకుంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. తన బాడీ లాంగ్వేజ్, వాయిస్ తనకి పెద్ద ప్లస్ పాయింట్ లుగా మారాయి.

త్వరలోనే వరలక్ష్మి శరత్ కుమార్ వరుస ఆఫర్లతో బిజీ కాబోతోంది అనడంలో అతిశయోక్తి కూడా లేదు. తాజా సమాచారం ప్రకారం ఈమెకు ఇప్పుడు హిందీ నుంచి కూడా భారీ ఆఫర్లు వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈమె ఎదుర్కొన్న ఒక పెద్ద విమర్శ గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. కోలీవుడ్ లోని ఒక పెద్ద మనిషి వరలక్ష్మి శరత్ కుమార్ వాయిస్ విని ఇండస్ట్రీకి ఈమె పనికిరాదని ఒకే ఒక్క ముక్కలో తేల్చి చెప్పేశాడట.

వాయిస్ పక్కన పెడితే నటిగా తన నటనను కూడా చూడకుండానే ఆయన ఆ మాట అనేశారట. అయితే దానికి వరలక్ష్మీ ఏమాత్రం బాధపడలేదట. అలాంటి ఎన్నో విమర్శలను సవాళ్లుగా స్వీకరించి ఆమె నటిగా ఎదిగానని చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. వాయిస్ లేకపోతే నిజంగానే ఇండస్ట్రీకి పనికిరాని పనికిరానేమోనని రివర్స్ కౌంటర్ కూడా వేసింది. ఆ వాయిస్ లో బేస్ మరియు ఎనర్జీ తాను నటిగా సక్సెస్ అవ్వడానికి చాలా సహకరించిందని ఆ ఎనర్జీ చూసి అందరూ షాక్ అయ్యేవారు," అని అంటుంది వరలక్ష్మి శరత్ కుమార్.

Rama Rao

Rama Rao

Next Story