Varalaxmi Sarathkumar:పెళ్లి తర్వాత నాలో పెద్దగా మార్పు ఏమీ లేదు.. నా భర్తే మారారు..

Varalaxmi Sarathkumar Open Her Marriage Life
x

పెళ్లి తర్వాత నాలో పెద్దగా మార్పు ఏమీ లేదు.. నా భర్తే మారారు..

Highlights

వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు.

Varalaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే వరలక్ష్మి నటించిన మదగజరాజ సినిమా 12 ఏళ్ల తర్వాత ఈ ఏడాది సంక్రాంతి కానుకగా కోలీవుడ్‌లో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ మూవీని జనవరి 31న టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తన వివాహంతో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వరలక్ష్మి షేర్ చేసుకున్నారు.

గత ఏడాది వరలక్ష్మి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత తనలో పెద్ద మార్పు ఏమీ రాలేదని.. కానీ నికోలయ్ లైఫ్‌లో మాత్రం ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. తన కోసం తన భర్త హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారని చెప్పారు. తన పేరును నికోలయ్ సచ్‌దేవ్ వరలక్ష్మి శరత్ కుమార్‌గా మార్చుకున్నారు అని చెప్పారు. కెరీర్ పరంగా తాను ఎన్నో సాధించాలని తన భర్త ఆశిస్తున్నట్టు తెలిపారు. వర్క్ విషయంలో ఫుల్ సపోర్ట్‌గా ఉంటారని అన్నారు.

తనకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం కూడా ఉండేది కాదని.. వివాహం తనకు సెట్ కాదని అనుకునేదాన్నని అన్నారు. కానీ నికోలయ్ పరిచయం తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిపోయిందన్నారు. తన పరిచయం తర్వాత అతనే తన జీవితానికి సరైన భాగస్వామి అని అర్థమైందన్నారు. అలా పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు.

ఇక మదగజరాజ సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా విడుదల గురించి విని తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. సంక్రాంతి కానుకగా తమిళనాడులో దీనిని విడుదల చేయగా ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేసినట్టు చెప్పారు. 12 ఏళ్ల క్రితం తీసిన సినిమా ఇప్పుడు విడుదలై కొత్త ట్రెండ్ సృష్టించిందన్నారు. ఈ సినిమాకు సుందర్. సి దర్శకత్వం వహించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌‌లో పలు చిత్రాల్లో నటించారు. వీరసింహారెడ్డి, కోట బొమ్మాళి, హనుమాన్ చిత్రాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది కన్నడలో కిచ్చా సుదీప్ హీరోగా నటించిన సినిమాలో కీలక పాత్ర పోషించారు వరలక్ష్మి శరత్ కుమార్.

Show Full Article
Print Article
Next Story
More Stories