Vaisshnav Tej: ఓటీటీలోకి వైష్ణవ్ తేజ్... ఎప్పుడో తెలుసా?

Vaisshnav Tejs OTT debut in December
x

వైష్ణవ్ తేజ్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Vaisshnav Tej: ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు.

Vaishnav Tej: మెగా కాంపౌండ్ ‌నుంచి ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. మలి సినిమా ఇప్పటికే ప్రారంభమైంది.

తాజాగా వైష్ణవ్ తేజ్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ యంగ్ హీరో రెండవ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించనుంది.

ఈ సినిమా కొండపొలం నవల ఆధారంగా రూపొందించబడుతోంది. అయితే ఈ స్క్రిప్ట్ ఓటీటీకి సరిగ్గా సరిపోతుందని, అందుకే నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఈ సనిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ఒక ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం.. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రసారం చేయనుందంట.

Show Full Article
Print Article
Next Story
More Stories