Vaisshnav Tej New Movie: కబడ్డీ ప్లేయర్‌గా వైష్ణవ్ తేజ్?

Vaisshnav Tej plays a Kabaddi Player role in his New Movie
x
వైష్ణవ్ తేజ్ (ఫొటో ట్విట్టర్)
Highlights

Vaisshnav Tej New Movie: సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సనిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

Vaisshnav Tej New Movie: సుప్రీం స్టార్ సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సనిమాతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు వైష్ణవ్ తేజ్. మలి సినిమా కోసం స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో జతకట్టాడు. అయితే ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తుంది.

తాజాగా వైష్ణవ్ తేజ్ మూడో సినిమా కోసం ఓ నూతన దర్శకుడితో జత కట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ సినిమాలో ఈ యంగ్ హీరో పాత్రపై నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. పృధ్వీ అనే నూతన డైరెక్టర్‌ టేకప్ చేయనున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామాగా రానుందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ కబడ్డీ ప్లేయర్ గా సందడి చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.

నాగార్జున అక్కినేని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ స్టోరీ లైన్‌ నాగార్జునకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం వైష్ణవ్ తేజ్ రూపును కొద్దగా మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త లుక్‌ లో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని పాత్ర కోసం వర్కౌట్లు మొదలు పెట్టినట్లు టాక్. త్వరలోనే ఈ నూతన సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివరినాటికి పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories