ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు.. ఆ మూవీపై భారీ అంచనాలు..

ఫిబ్రవరిలో థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు.. ఆ మూవీపై భారీ అంచనాలు..
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి లాక్ డౌన్ రూల్స్ కారణంగా ఏడాది పాటు టాలీవుడ్ సినిమాలు రిలీజ్ లేక థియేటర్లు ముగబోయాయి. కాగా.. ఈ ఏడాది కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో...

కరోనా వైరస్ వ్యాప్తి లాక్ డౌన్ రూల్స్ కారణంగా ఏడాది పాటు టాలీవుడ్ సినిమాలు రిలీజ్ లేక థియేటర్లు ముగబోయాయి. కాగా.. ఈ ఏడాది కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో థియేటర్లు కూడా ఓపెన్ అయిపోయాయి. సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి పండగ తర్వాత కూడా.. అది ఫిబ్రవరిలో కూడా వరస సినిమాలు వచ్చేస్తున్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో యేదో ఒకటో రెండో సినిమాలు విడుదల అవుతాయి. ఈ సారి మాత్రం 10 సినిమాల వరకు విడుదలవుతున్నాయి. ఈ నెల నుంచి థియేటర్లకు ఫుల్ పర్మీషన్స్ రావడంతో ఈ సినిమాలు అన్నిటికి కలిసోచ్చే అంశం అని చెప్పాలి. అందులోనే నితిన్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు నటించిన క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. భీష‌్మ ఫిబ్రవరిలో వచ్చి హిట్ కొట్టడంతో నితిన్ చెక్ విషయంలో అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు నితిన్.

ఏడాది కాలంగా వాయిదా పడ్డ మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కూడా ఈ నెలలోనే విడుదల కానుంది. తేజ సజ్జ హీరోగా పరిచయమవుతూ.. తెలుగులో తొలిసారిగా జాంబీ జోనర్లలో వస్తున్న చిత్రం జాంబీ రెడ్డి. కామెడీ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే నెలలో వచ్చే సినిమాలు ఎంటో చూద్దాం. ఫిబ్రవరి 12సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస.. ఫిబ్రవరి 14శ్రీకాంత్ ఊహించలేదు కదు, ఫిబ్రవరి 19ధృవ సర్జ పొగరు, ఫిబ్రవరి 26నందితా శ్వేతా అక్షర, ఫిబ్రవరి 26సుమంత్ కపటదారి చిత్రం రానుంది. ఉప్పెన సినిమా పాటలు సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories