Uppena Movie Review: 'ఉప్పెన'మూవీ రివ్యూ

uppena Review
x

ఉప్పెన రివ్యూ 

Highlights

కొత్త సినిమా అంటే ఎదురుచూపులు.. అంచనాలు సహజం. అయితే, ఇటీవల సినిమాలో ఒక్క సీన్ ఎలా తీశారు అనే అంశం కోసమే యావత్తు టాలీవుడ్ ఎదురుచూసింది. ఆ సినిమా...

కొత్త సినిమా అంటే ఎదురుచూపులు.. అంచనాలు సహజం. అయితే, ఇటీవల సినిమాలో ఒక్క సీన్ ఎలా తీశారు అనే అంశం కోసమే యావత్తు టాలీవుడ్ ఎదురుచూసింది. ఆ సినిమా 'ఉప్పెన'. ఆ సీన్ కటింగ్ సీన్.

సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి ఆసక్తి రేకెత్తించేవి కొన్ని ఉంటాయి. పాటలు విన్నాకా అంచనాలు ఏర్పడేవి కొన్నుంటాయి. ట్రైలర్ వచ్చాకా ఒకసారి సినిమా చూడాల్సిందే అనిపించేలా మరి కొన్ని సినిమాలు ఉంటాయి. కానీ, 'ఉప్పెన' సినిమా మాత్రం ఎనౌన్స్ చేసిన దగ్గరనుంచీ తెలుగు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఆసక్తి ట్రైలర్ తో అంచనాల 'ఉప్పెన' గా మారింది.

మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసిన హీరో పంజా వైష్ణవ్ తేజ్. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ఇమేజ్‌ని మోస్తూ 'ఉప్పెన'సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాడు వైష్ణవ్ తేజ్. చిరంజీవి కుంటుంబం నుంచి సినీరంగ ప్రవేశం చేస్తున్న మరో హీరో కావడంతో ఉప్పెన సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెంచింది. ఇన్ని అంచనాల మధ్యలో ఈరోజు (ఫిబ్రవరి 12) సినిమా విడుదల అయ్యింది. ఈ అంచనాలు ఉప్పెన అందుకుందా? రివ్యూలో తెలుసుకుందాం.

కథ

ఉప్పాడ గ్రామంలోని మత్య్సకార కుటుంబానికి ఆశీ అలియాస్ ఆశీర్వాదం(పంజా వైష్ణవ్‌ తేజ్‌). తండ్రి చేసే చేపల వ్యాపారానికి చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయనకు గ్రామ పెద్ద, వ్యాపారవేత్త రాయణం(విజయ సేతుపతి) కూతురు బేబమ్మ అలియాస్‌ సంగీత(కృతి శెట్టి) అంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి బేబమ్మను ప్రేమిస్తుంటాడు. మరోవైపు రాయణం పరువు కోసం ఎంతటి దారుణానికికైనా పాల్పడుతాడు. బేబమ్మ.. ఆశీతో ప్రేమలో పడిపోతుంది. ఓ సంఘటన వల్ల రాయణంకు తన కూతురు విషయం తెలుసి సంగీతను కట్టడి చేసే ప్రయత్నం చేస్తాడు. సంగీత ఆశీర్వాదంతో వెళ్లిపోతుంది. ప్రేమించిన బేబమ్మను ఆశీ ఎందుకు తిరిగి అప్పగింస్తాడు? రాయణం ఏం చేశాడు? ఆశి ఏం కోల్పోయాడు? అనేది మిగతా కథ.

ఎవరేలా చేశారంటే

ఈ కథనే కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. కథను కళ్లకు కట్టినట్లుగా తెరపై చూపించాడు. తనదైన స్క్రీన్‌ప్లేతో పాత స్టోరీకి ట్రీట్‌మెంట్ కాస్త డిఫరెంట్‌గా ఇచ్చాడు. జానీ, శంకర్ దాదా వంటి సినిమాల్లో బాలనటుడిగా నటించి మెప్పించిన వైష్ణవ్ తేజ్‌కు హీరోగా చేసిన తొలి ప్రయత్నం ఇది. వైష్ణవ్‌కు నటనతో పేక్షకులకు ఇది తొలి సినిమానా అని గుర్తుపట్టరు. ఓ పేదింటి కుర్రాడి క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ఎమోషనల్‌ సన్నీవేశాల్లో వైష్ణవ్ తేజ్ పలికించిన హావభావాలు అవలీలగా చేసేశాడు.

కృతి శెట్టి ఇక బేబమ్మ పాత్రకు ప్రాణం పోసింది. కృతి శెట్టి తొలి సినిమాయే అయినా అద్భతంగా నటించింది. విజయ్‌ సేతుపతిది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సేతుపతి నటన మొత్తం సినిమాకే హైలెట్ గా నిలిచింది. కృతి శెట్టి, విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. దేవిశ్రీ ప్రాసాద్‌ సంగీతం. తనదైన పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో సినిమా రేంజ్‌ని అమాంతం పెంచేశాడు. శ్యామ్ దత్ విజువల్స్‌ బాగున్నాయి. నవీనూలి ఎడిటింగ్‌ పర్వాలేదు. చివరగా ఉప్పెన సినిమా గురించి చెప్పాలంటే భావోద్వేగాలతో కూడుకున్న ప్రేమకథ.

Show Full Article
Print Article
Next Story
More Stories