రాక్షసుడిగా నాని .. రక్షకుడిగా సుదీర్ బాబు

రాక్షసుడిగా నాని .. రక్షకుడిగా సుదీర్ బాబు
x
Highlights

వైవిధ్యమైన కథలు చేయడంలో ఇంద్రగంటి మోహన కృష్ణ సిద్దహస్తుడు. ప్రస్తుతం అయన దర్శకత్వంలో 'వి' అనే చిత్రం తెరకెక్కుతుంది.

వైవిధ్యమైన కథలు చేయడంలో ఇంద్రగంటి మోహన కృష్ణ సిద్దహస్తుడు. ప్రస్తుతం అయన దర్శకత్వంలో 'వి' అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాని, సుదీర్ బాబు హీరోలుగా నటిస్తుండగా, అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. హీరో నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం..

దాదాపుగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. సినిమా ప్రమోషన్స్ ని రొటీన్ గా కాకుండా కొత్తగా మొదలు పెట్టింది చిత్ర బృందం.

సినిమా ఫస్ట్ లుక్స్ ను డిఫరెంట్ గా అనౌన్స్ చేసారు హీరోలు నాని, సుదీర్ బాబు.. . ఒకరి ట్వీట్ ను మరొకరు రీ ట్వీట్ చేస్తూ సినిమా అప్డేట్స్ ని ట్వీట్ చేశారు. "కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు ... "రాక్షసుడు" ఎదిగిన నాడు ఒకడొస్తాడని ..... వాడే ఇప్పుడొస్తున్నాడు ... "రక్షకుడు" వస్తున్నాడు " అని సుదీర్ బాబు ట్వీట్ చేయగా, " ఓహో... అలాగా... సరే! " అని హీరో నాని రీ ట్వీట్ చేశాడు. దీనితో ఇందులో నాని నెగిటివ్ రోల్ చేస్తున్నాడన్న విషయం అర్ధం అయిపొయింది. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories