Urvashi Rautela: సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు.. ఎందుకంటే?

Urvashi Rautela: సైఫ్ అలీఖాన్‌కు ఊర్వశీ రౌతేలా క్షమాపణలు.. ఎందుకంటే?
x
Highlights

Urvashi Rautela: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశీ రౌతేలా క్షమాపణలు చెప్పారు.

Urvashi Rautela: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశీ రౌతేలా క్షమాపణలు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దుండగుల దాడిలో గాయపడిన సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో తన వజ్రపు ఉంగరం, రోలెక్స్ వాచీని చూపిస్తూ మాట్లాడడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. దీంతో దిగొచ్చిన ఊర్వశి.. సైఫ్‌నకు క్షమాపణలు చెబుతూ ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు.

సైఫ్ సర్ మీకు ఈ మెసేజ్ చేరుతుందని ఆశిస్తున్నా. మీ గురించి మాట్లాడే సమయంలో తాను ప్రవర్తించిన తీరుకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ విషయంలో మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ఇంటర్వ్యూ సమయంలో మీపై జరిగిన దాడి తీవ్రత తనకు తెలియదన్నారు. గత కొన్ని రోజుల నుంచి తాను డాకు మహారాజ్ సినిమా విజయోత్సవంలో ఉన్నానని వివరించారు. దీంతో ఆ సినిమా వల్ల తనకు వచ్చిన బహుమతుల గురించి మాట్లాడాను.. ఈ విషయంలో సిగ్గుపడుతున్నా.. క్షమించండి. దాడి తీవ్రత తెలిశాక చాలా బాధపడ్డాను. ఆ సమయంలో మీ ధైర్యం నిజంగా ప్రశంసనీయం. మీ పై గౌరవం పెరిగిందని చెప్పుకొచ్చారు.

ఇంతకీ ఊర్వశి ఏం మాట్లాడారంటే.. డాకు మహారాజ్ సినిమా విజయం తర్వాత తనకు ఎంతోమంది బహుమతులు పంపించారని తెలిపారు. అయితే తన బహుమతులను దాడికి ముడిపెడుతూ మాట్లాడడంతో విమర్శలు ఎదుర్కొన్నారు. సైఫ్ పై దాడి దురదృష్ణకరం. తాను నటించిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ రూ.150 కోట్లు వసూళ్లు సాధించిందని చెప్పారు. మూవీ విజయం సాధించడంతో మా అమ్మ వజ్రపు ఉంగరం గిప్టుగా ఇచ్చారు. నాన్న రొలెక్స్ వాచ్ ఇచ్చారని ఆనందంగా చెప్పుకొచ్చారు. కానీ వీటిని ధరించి బయటకు వెళ్లే పరిస్థితి లేదని.. ఎందుకంటే ఎవరైన మనపై దాడి చేస్తారనే భయం ఉంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ట్రోల్స్ రావడంతో సైఫ్‌న కు క్షమాపణలు చెబుతూ తాజాగా ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

ఇక హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి బాలీవుడ్ ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories