Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న ఉప్పెన డైరెక్టర్?

Uppena Director’s Next Movie With Jr.NTR?
x

Buchi Babu, Jr.Ntr

Highlights

Jr NTR: ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు బంపర్ ఆఫర్ కొట్టేశాడనే టాలీవుడ్ టాక్.

Jr.Ntr: తీసింది ఒకే ఒక్క సినిమా.. కాని అది బ్లాక్ బస్టర్ హిట్. కరోనా కరువు కాలంలో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకుల సినిమా కరువు తీర్చేసింది. సినిమాలకు నెగెటివ్ అయ్యే పాయింట్ ను తీసుకుని.. పాజిటివ్ హిట్ కొట్టిన సానా బుచ్చిబాబు టాలీవుడ్ మదిని దోచుకున్నాడు. ఉప్పెన సినిమాను తీసిన విధానం.. స్క్రీన్ ప్లే బుచ్చిబాబు రేంజ్ ని అమాంతం పెంచేశాయి. అందుకే ఉప్పెనలా అవకాశాలు వచ్చిపడతాయని అందరూ ఊహించారు. కాని ఉప్పెన లాంటి అవకాశం వచ్చి పడింది బుచ్చిబాబుకి. ఏకంగా యంగ్ టైగర్ నే తన కథతో కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇవి వార్తలే అనుకున్నా.. బుచ్చిబాబు తారక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన పోస్ట్ అవి నిజమే అనిపించేలా చేస్తున్నాయి.

లోకల్ స్టోరీని ప్రపంచవ్యాప్తంగా చెప్పి ఓ ట్రెండ్ సృష్టిద్దాం సార్ అంటూ పోస్టు పెట్టి.. యంగ్ టైగర్ తో సినిమా తీయడం కోసం వెయిటింగ్ అని పెట్టాడు. దీంతో బుచ్చిబాబు బంపర్ ఆఫర్ కొట్టేశాడనే టాలీవుడ్ భావిస్తోంది. అయితే ఈ సినిమా ఏ బ్యానర్ మీద ఉంటుంది.. అనేదే సస్పెన్స్. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్నాడు. కరోనాతో అది లేటు అయి.. ఇంకా సాగుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా ఫైనల్ చేశాడు.. అటు కొరటాల శివతోనూ మరో సినిమా ఫైనల్ చేసినట్లు చెబుతున్నారు. బుచ్చిబాబు సినిమా ఉంటే గింటే ఆ రెండిటి తర్వాతే ఉండాలి. మరెన్నాళ్లు పడుతుందో చూడాలి. బహుశా 2023లో బుచ్చిబాబు సినిమా తెరకెక్కే ఛాన్స్ ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories