Krithi Shetty Remuneration: కొత్త సినిమాలకు రూ.60 లక్షలంటోన్న ఉప్పెన భామ.!

Uppena Actress Krithi Shetty Remuneration
x

కృతి శెట్టి (ఫోటో ట్విటర్)

Highlights

Krithi Shetty: కొందరు హీరోయిన్లకు ఎన్ని సినిమాలు చేసినా కలిసిరాదు. మరికొంతమందికి మాత్రం ఫస్ట్ సినిమాతోనే లక్ మారిపోతుంది.

Krithi Shetty Remuneration: కొందరు హీరోయిన్లకు ఇండస్ర్డీలో ఎన్ని సినిమాలు చేసినా కలిసిరాదు. మరికొంతమందికి మాత్రం ఫస్ట్ సినిమానే బ్టాక్ బస్టర్ హిట్ తో లక్ మారపోతుంది. ప్రస్తుతం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది. ఉప్పెన మూవీతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. ఇదే కాదు.. మరో రకంగాను ఉప్పెన క్యూటీకి లక్ కలిసి వచ్చింది. నిజానికి ఉప్పెనలో ముందు అనుకున్న హీరోయిన్ ఈమె కాదు.. మనీషా రాజ్ అనే మరో ఆమెను తీసుకున్నారు. ఎందుకో మనసు కుదరక కృతి ని ఫైనల్ గా సెలక్ట్ చేశాడు దర్శకుడు బుచ్చిబాబు.

ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ డెబ్యూ హీరోకు సాధ్యం కాని రీతిలో ఉప్పెన దూసుకెళ్తుంది. రూ. 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఔరా అనిపిస్తుంది. ఈ సినిమా విడుదల కాకముందు రిలీజైన సాంగ్స్ తోనే కృతి గురించి ఇండస్ర్డీలో చర్చలు మొదలయ్యాయి. ఈమె ఎక్కడ్నుంచి వచ్చింది అంటూ ఆరా తీసారు. పైగా ప్రీరిలీజ్ లోనూ చిరంజీవి కూడా ఇదే మాట చెప్పాడు. ఒక్కసారి ఉప్పెన విడుదలైతే ఈ అమ్మాయి మీకు దొరకమంటే కూడా దొరకదు.. ఇప్పుడే హీరోయిన్ గా బుక్ చేసుకోండి అంటూ చెప్పాడు. మెగాస్టార్ అన్నట్లుగానే జరుగుతుందిప్పుడు. ఉప్పెన రిలీజ్ తర్వాత కృతి డేట్స్ హాట్ కేక్ లా మారిపోయాయి.

చాలా మంది నిర్మాతలు ఇప్పుడు కృతి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. అలా ఎదురు చూస్తున్న వారికి రెమ్యునరేషన్ తో మరోలా షాకింగ్ ఇవ్వబోతోంది ఈ భామ. ఉప్పెన సినిమా కోసం కేవలం రూ. 6 లక్షలు మాత్రమే తీసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే నాని శ్యామ్ సింగ రాయ్.. సుధీర్ బాబు సినిమాల కోసం రూ. 25 లక్షల చొప్పున తీసుకుంటుంది కృతి శెట్టి. ఇక నుంచి సైన్ చేసే మూవీస్ కు మాత్రం రూ.60 లక్షలు డిమాండ్ చేస్తుందంట. కేవలం ఒక్క సినిమాతో కృతి శెట్టి లక్ అమాంతం..రూ.6 లక్షల నుంచి రూ.60 లక్షలకు మారింది. ప్రస్తుతం ఈ భామ వయస్సు 17 ఏళ్లు మాత్రమే. కేవలం అందం తోనే కాదు నటనలోనూ రాణించడంతో భారీ పారితోషికం అడుగుతున్నా కూడా ఓకే అంటున్నారు దర్శక నిర్మాతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories