మహేష్ బాబుకి సారి చెప్పిన ఉపేంద్ర

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన 'మహర్షి' సినిమా విడుదల ఏప్రిల్ 25 వ తారీకు...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన 'మహర్షి' సినిమా విడుదల ఏప్రిల్ 25 వ తారీకు నుంచి మే 9వ తారీకు కు వాయిదా పడింది. ఇక ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు మహేష్ బాబు భార్య నమ్రత ఇవాళే సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఈ సినిమా పూర్తవగానే మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడని తెలిసిన విషయమే. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా లో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మరియు 'రాములమ్మ' విజయశాంతి కీలక పాత్రలలో నటిస్తున్నారు అని వార్తలు బయటకు వచ్చాయి.
తాజాగా ఒక కన్నడ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఉపేంద్ర మహేష్ బాబు సినిమాలో నటించమని తనను కోరారని కానీ వారు అడిగిన డేట్స్ ముందే బుక్ కావడం వల్ల తను నటించి లేక పోతున్నానని చెప్పిన ఉపేంద్ర "మీ సినిమాలో నటించేందుకు ఒప్పుకోనందుకు సారీ మహేష్ బాబు గారు. అవకాశం ఉంటే మరెప్పుడైనా తప్పకుండా మీతో కలిసి నటించాలని కోరుకుంటున్నాను" అని ఉపేంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ఈ సినిమాల్లో నటిస్తారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పైగా ఎన్నికల సమయం కాబట్టి ఈమె సినిమాను తిరస్కరిస్తుందని కొందరు అంటున్నారు.
లైవ్ టీవి
ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్
6 Dec 2019 3:11 AM GMTలక్కంటే నాగ చైతన్యదే.. ఓ రేర్ రికార్డ్
6 Dec 2019 3:08 AM GMTఎట్టకేలకు ముగిసిన గన్నవరం పంచాయితీ
6 Dec 2019 3:06 AM GMTఈ నెలాఖరుకల్లా 'వైయస్ఆర్ నవశకం' సర్వే పూర్తి కావాలి..
6 Dec 2019 2:36 AM GMT2020 ఏడాది సెలవులు ఇవే..
6 Dec 2019 2:31 AM GMT