Upcoming Movies Theaters and OTT: ఈ వారం థియేటర్‌,‌ ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు

Upcoming Telugu Movies and Web Series In Theaters and OTT Plat Forms This Week
x

ఈ వారం థియేటర్‌,‌ ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు 

Highlights

మహాశివరాత్రి సందర్భంగా థియేటర్‌లలో పలు చిత్రాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Upcoming movies: మహాశివరాత్రి సందర్భంగా థియేటర్‌లలో పలు చిత్రాలు సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

దర్శకుడు త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ తెలుగు కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం మజాకా. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా చేసింది. రావు రమేష్, మన్మథుడు హీరోయిన్ అన్హు కీలక పాత్రలు పోషించారు. రాజేష్ దండా, ఉమేశ్ కె.ఆర్.బన్సాల్ నిర్మించారు. ఇది సందీప్ కిషన్‌కి 30వ చిత్రం. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదల కానుంది. తండ్రిగా రావు రమేష్. కొడుకుగా సందీప్ కిషన్.. ఆ ఇద్దరి ప్రేమ కథలతో సాగే సరదా చిత్రమని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. పూర్తిగా వినోదంతో నిండిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా ముస్తాబైంది.

వైశాలి చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివళగన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం శబ్దం. 7జీ ఫిల్మ్స్ శివ నిర్మించారు. లక్ష్మీ మేనన్, లైలా, సిమ్రన్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుమల ముందుకు రానుంది. మంచి కథ, భావోద్వేగాలతో నిండిన హరర్ మూవీ అని చిత్ర బృందం చెబుతోంది. శబ్దం ఒక ఆయుధమని.. ఒక రమైకమైన కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూపించినట్టు తెలుస్తోంది.

రంగం ఫేమ్ జీవా నటించిన లేటెస్ట్ మూవీ అగాథియా. ఏంజిల్స్ వర్సెస్ డెవిల్. రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్ర పోషించారు. పా.విజయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో ఓ సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతోంది. ఇక తమిళం, తెలుగుతో పాటు పాన్ ఇండియా రిలీజ్‌కి మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.

నూతన నటీనటులు ఆదిత్య, ప్రియ జంటగా రాజ్ లోహిత్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం తకిట తదిమి తందాన. కొప్పుల చందన్ కుమార్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను అలరించేలా కథ, కథనాలను తీర్చిద్దినట్టు మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, సిరీస్‌లు..

నెట్‌ఫ్లిక్స్:

డబ్బా కార్టెల్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 28

అమెజాన్ ప్రైమ్:

సుడల్ 2 (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 28

జిద్దీ గర్ల్స్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 27

హౌస్ ఆఫ్ డేవిడ్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 27

సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ సినిమా) ఫిబ్రవరి 28

జియో హాట్ స్టార్:

లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (మలయాళం) ఫిబ్రవరి 28

బీటిల్ జ్యూస్ (హాలీవుడ్ మూవీ) ఫిబ్రవరి 28

ది వాస్ప్ (హాలీవుడ్ మూవీ) ఫిబ్రవరి 28

సూట్స్: లాస్ ఏంజిల్స్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 24

ఎంఎక్స్ ప్లేయర్:

ఆశ్రమ్ 3 (హిందీ సిరీస్) ఫిబ్రవరి 27

Show Full Article
Print Article
Next Story
More Stories