OTT Movies : ఓటీటీలో మోస్ట్ అవైటైడ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే ?

OTT Movies : ఓటీటీలో మోస్ట్ అవైటైడ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే ?
x
Highlights

OTT Movies: 2025లో ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి రిజల్ట్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై అందుబాటులోకి రానున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు వంటి భాషల్లో భారీ అంచనాలు ఏర్పడిన కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి.

OTT Movies: 2025లో ఇప్పటి వరకు విడుదల అయిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి రిజల్ట్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై అందుబాటులోకి రానున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు వంటి భాషల్లో భారీ అంచనాలు ఏర్పడిన కొన్ని సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. మలయాళ మూవీ "రేఖాచిత్రం", హిందీ సినిమా "దేవా", అలాగే తెలుగులో వచ్చిన "సంక్రాంతికి వస్తున్నాం" వంటి చిత్రాలు త్వరలో ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వీటిని ప్రజలు ఎక్కడైనా, ఎప్పుడైనా చూసే అవకాశం ఉంటుంది.

రేఖాచిత్రం

మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ "రేఖాచిత్రం" 2025 మార్చి 7న సోనీ లివ్‌పై ప్రసారం కానుంది. జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అసిఫ్ అలీ, ఆనస్వర రాజన్, మమ్ముట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మలక్కాపరాలో ఒక ఆత్మహత్య కేసును ఛేదించే ప్రయత్నం ఆధారంగా తెరకెక్కింది.

దేవా

షాహిద్ కపూర్, పూజా హెగ్డే జంటగా నటించిన "దేవా" 2025 మార్చి నెలలో నెట్ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. ఇది 2013లో విడుదలైన మలయాళ చిత్రం "ముంబై పోలీస్" రీమేక్‌గా రూపుదిద్దుకుంది. "దేవా" చిత్రానికి రోషాన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించగా, జేక్స్ బేజాయ్ సంగీతం అందించారు.

సంక్రాంతికి వస్తున్నాం

ఈ తెలుగులోని యాక్షన్ కామెడీ చిత్రం "సంక్రాంతికి వస్తున్నాం" 2025 మార్చి 1న ZEE5లో ప్రసారం కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేశ్, మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేష్ నటించారు. తెలుగు బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.300కోట్లకు పైగా వసూలు చేసింది.

తండేల్

నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన "తండేల్" 2025లో నెట్ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. ఈ చిత్రం 2018లో జరిగిన ఒక వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కింది. అందులో కొందరు మత్స్యకారులు పాకిస్తాన్ లో వెళ్లి చిక్కుకుపోతారు. వారిని విడిపించే క్రమంలో జరిగే ఆసక్తికర సన్నివేశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

ఛావా

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా, అక్షయ్ ఖన్నా నటించిన "ఛావా". 2025లో నెట్ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రం సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం శివాజీ సావంత్ రచించిన "చావా" అనే మ‌రాఠి నవల ఆధారంగా రూపుదిద్దుకుంది.

ఎమర్జెన్సీ

2025లో "ఎమర్జెన్సీ" సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతుంది. కంగనా రనౌత్ నిర్మించిన ఈ సినిమా భారతదేశపు అత్యంత చారిత్రక ఘటన "ఇండియన్ ఎమర్జెన్సీ" ఆధారంగా తెరకెక్కింది. మొదట 2024 సెప్టెంబర్‌లో విడుదల కావలసిన ఈ చిత్రం..కొన్ని అనివార్య కారణాల వల్ల 2025 జనవరి 17న విడుదలైంది.

ఈ సినిమాలను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories