ఉపాసన పుట్టినింట విషాదం..

ఉపాసన పుట్టినింట విషాదం..
x
Highlights

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పుట్టినింట విషాదం నెలకొంది.

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన పుట్టినింట విషాదం నెలకొంది. ఉపాసన తాతయ్య మాజీ ఐఏఎస్ అధికారి కామినేని ఉమాపతిరావు మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమాపతిరావు బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తాతయ్య మరణాన్నిఉపాసన ట్విటర్ ద్వారా దృవీకరించారు. ఈ సందర్బంగా‌ తాతయ్యకు సంతాపం తెలిపారు. ట్విట్టర్ లో ఇలా పేర్కొన్నారు.. తాత కె.ఉమాపతి రావు గొప్ప విలువలు, నిస్వార్థం, మానవతామూర్తి గల వ్యక్తి అని..

ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే అని.. చెబుతూ.. ఉర్దూలో ఎన్నో రచనలు రాశారని పేర్కొన్నారు. కాగా, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని దోమకొండకు చెందిన ఉమాపతిరావు ఐఏఎస్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారని.. అలాగే టీటీడీ తొలి ఈవోగా పనిచేశారని అన్నారు. తాత ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్టర్ లో ఉపాసన భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories