Upasana Konidela: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!

Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, మెగా కుటుంబానికి కోడలిగా మాత్రమే కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా కూడా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

Arun Chilukuri
Published on: 14 Jun 2023 12:29 PM IST
Upasana Konidela Take Big Decision For Upcoming Baby
X

Upasana Konidela: పుట్టబోయే బిడ్డ కోసం ఉపాసన కీలక నిర్ణయం!

Upasana Konidela: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, మెగా కుటుంబానికి కోడలిగా మాత్రమే కాకుండా ఒక ఎంటర్ప్రెన్యూర్ గా కూడా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అపోలో లైఫ్ కు వైస్ చైర్ పర్సన్ గా ఎన్నో ఏళ్లగా సేవలు అందిస్తూ వస్తున్న ఉపాసన 2012 లో రామ్ చరణ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఉపాసన త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఉపాసన గర్భం ధరించడంతో ఆ క్షణం కోసం మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉపాసన సైతం తనకు పుట్టబోయే బిడ్డకోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. బేబీ ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఉపాసన వెల్లడించింది. అంతేకాకుండా బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో బేబీతో పాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసమే అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు పేర్కొంది.

స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే.. బొడ్డు తాడు దాచుకోవడం. భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా ఆనారోగ్య సమస్యలు వస్తే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధానం స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్నారు. ఈ విధానంపై మన దేశంలో పెద్దగా అవగాహన లేదు. అయితే, గతంలో మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా తమ పిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story