Unstoppable With NBK 2: బాలకృష్ణ షోలో చంద్రబాబు.. 'అన్‌స్టాపబుల్‌' హంగామా ఆరోజే..!

Unstoppable With NBK 2: బాలకృష్ణ షోలో చంద్రబాబు.. ‘అన్‌స్టాపబుల్‌’ హంగామా ఆరోజే..!

Arun Chilukuri
Published on: 10 Oct 2022 4:48 PM IST
Unstoppable with NBK Episode With Chandrababu to Premier on October 14th
X

Unstoppable With NBK 2: బాలకృష్ణ షోలో చంద్రబాబు.. ‘అన్‌స్టాపబుల్‌’ హంగామా ఆరోజే..!

Unstoppable Season 2: నందమూరి హీరో బాలకృష్ణ ఆహాలో వచ్చిన సెలబ్రిటీ టాక్ షో "అన్‌స్టాప‌బుల్" వల్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బుల్లితెర ప్రేక్షకులకు బాలకృష్ణ ఈ షో తో చాలా బాగా దగ్గర అయిపోయారు. తన కామెడీ టైమింగ్ మరియు డైలాగులతో షో ఫస్ట్ సీజన్ ని బ్లాక్ బస్టర్ అయ్యేలా చేశారు బాలకృష్ణ. ఇక అప్పటినుంచి అభిమానులు అందరూ సీజన్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూడడం మొదలుపెట్టారు.

ఇప్పటికే విడుదలైన సీజన్ 2 ట్రైలర్ ఆకట్టుకుంది. అంతేకాకుండా ట్రైలర్‏లో మరింత పవర్ ఫుల్ డైలాగ్స్ చెబుతూ సీరియస్‏గా కనిపించారు బాలయ్య. ఇక ఇప్పుడు సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ షోకు మొదటి అతిథిగా చంద్రబాబు రాబోతున్నారు. ఇదే విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించింది. సంబంధిత ఎపిసోడ్‌ అక్టోబరు 14న టెలికాస్ట్‌ కాబోతుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. 'టు లెజెండ్స్‌.. వన్‌ సెన్సేషనల్‌ ఎపిసోడ్‌' అంటూ సదరు సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేసింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story