రంగస్థల నటుడి నుంచి సినీ రంగం వైపు అడుగులు

రంగస్థల నటుడి నుంచి సినీ రంగం వైపు అడుగులు
x
Highlights

టాలీవుడ్‌లో శోకసంద్రంలో నెలకొంది. నటుడు శివప్రసాద్‌ మృతితో దిగ్భ్రాంతి చెందుతోంది. వెండితెరపై క్యారెక్టర్‌ ఆర్టీస్ట్‌గా విలన్‌గా కమెడియన్‌గా...

టాలీవుడ్‌లో శోకసంద్రంలో నెలకొంది. నటుడు శివప్రసాద్‌ మృతితో దిగ్భ్రాంతి చెందుతోంది. వెండితెరపై క్యారెక్టర్‌ ఆర్టీస్ట్‌గా విలన్‌గా కమెడియన్‌గా తనదైనమార్క్‌ను చాటుకున్నారు. ఏ క్యారెక్టర్‌లోనైనా తనదైన మార్క్‌తో మెప్పించారు. శివప్రసాద్‌ మృతితో పలువురు నటులు తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

చిన్నప్పటి నుంచి ఉన్న నాటకాలంటే పిచ్చే ఆయనను నటుడిగా మార్చింది. స్వతహాగా రంగస్థల నటుడు. ఎన్నో వేదికలపై తనదైన డైలాగ్‌ డెలవరీతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టి పలు సినిమాల్లో నటించి మెప్పించారు. మొదట్లో ఎన్నో సినిమాల్లో చిన్నా చితక వేషాలతో అలరించాడు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన మస్టారి కాపురం సినిమా శివప్రసాద్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అటు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' సినిమాలో విలన్‌గా మెప్పించారు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు.

తులసి దూసుకెళ్తా, ఆటాడిస్తా, మస్కా, కుబేరులు, ఒక్కమగాడు, కితకితలు, డేంజర్‌, ఖైదీ చిత్రాలు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. సయ్యాట, ద్రోణ, కుబేరులు, ఒక్కమగాడు, కితకితలు, జైచిరంజీవ, పిల్ల జమీందార్‌, బలాదూర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, బ్రహ్మ లోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలతో పాటు మరెన్నో చిత్రాల్లో నటించారు. ఇక నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా సినిమాలో నన్ను కొట్లే అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యాడు శివప్రసాద్.

మంచి నటుడే కాదు ఆయన పలు చిత్రాలకు డైరెక్టర్‌ కూడా చేశారు. దర్శకుడిగా ప్రేమ తపస్సు, టోపి రాజా స్వీటీ రోజా, ఇల్లాలు, కొక్కొరొకో అనే నాలుగు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి వచ్చారు. ఒకప్పటి టాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌ రోజాను వెండితెరకు పరిచయం చేశాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories