హీరోల మొదటి సినిమాలు - రిజెక్ట్ చేసిన దర్శకులు

Tollywood
x
Tollywood
Highlights

లానా హీరోల కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా మంది దర్శకులు అనుకుంటారు. లేదా పలానా దర్శకుడితో తన

పలానా హీరోల కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా మంది దర్శకులు అనుకుంటారు. లేదా పలానా దర్శకుడితో తన మొదటి సినిమా చేయాలనీ హీరోలు భావిస్తారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇవి కుదరవచ్చు.. కుదరకపోవచ్చు... అలా కుదరని కొన్ని సినిమాలను ఇప్పుడు చూద్దాం..

తేజ- అల్లు అర్జున్

జయం సినిమాతో అల్లు అర్జున్ ని వెండితెరకి పరిచయం చేద్దామని అనుకున్నాడట తేజ .. కానీ ఆ సినిమాని నితిన్ తో చేశాడు.

కృష్ణవంశీ - మహేష్ బాబు

మహేష్ బాబు మొదటి సినిమా దర్శకుడు కృష్ణవంశీ అయితే బాగుంటుందని సూపర్ స్టార్ కృష్ణ అనుకున్నారట.. కానీ అంచనాలు బాగా ఉంటాయి కాబట్టి రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు మహేష్ బాబు... ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో మురారి అనే సినిమాని చేశాడు మహేష్..

పూరి జగన్నాధ్ - నాగచైతన్య

నాగచైతన్య మొదటి సినిమాని పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేయించాలని నాగార్జున అనుకున్నాడట.. కానీ స్టొరీ సెట్ కాక వాసు వర్మ దర్శకత్వంలో జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య..

రాజమౌళి- రామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్.. అప్పుడు చిరంజీవి రాజమౌళితో చరణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని అనుకున్నాడట.. కానీ అప్పటికి చరణ్ బాడీ లాంగ్వేజ్ తెలియదు కాబట్టి రెండో సినిమా చేస్తానని రాజమౌళి చెప్పాడట...అలా చరణ్ రెండో సినిమాగా ,మగధీర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రాఘవేంద్రరావు- రానా

దగ్గుబాటి వెంకటేష్ ని వెండితెరకి పరిచయం చేసిన రాఘవేంద్రరావు తోనే రానాని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నారట రామానాయుడు.. కానీ అనుకోని కారణాల వల్ల అది కుదరలేదు. శేఖర్ కమ్ముల చెప్పిన కథ ఒకే కావడంతో లీడర్ సినిమా వచ్చింది.

క్రిష్- వరుణ్ తేజ్

మెగా బ్రదర్ నాగబాబు కుమారుడిగా వెండితెరకి పరిచయం అయ్యాడు వరుణ్ తేజ్.. మొదటి సినిమా కథగా క్రిష్ సబ్జెక్ట్ వచ్చినప్పటికి మొదటి సినిమాగా ఇదో బాగోదని చిరంజీవి చెప్పడంతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు వరుణ్.. ఆ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో వరుణ్ కంచే అనే సినిమాని చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

విక్రమ్ కే కుమార్- అఖిల్

అఖిల్ మొదటి సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయాల్సింది. కథలు కూడా విన్నారు. అప్పటికే నితిన్ దగ్గర కథ ఉండడంతో వినాయక్ దర్శకత్వంలో సినిమాని చేశాడు అఖిల్.. ఆ తర్వాత సినిమాని విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో చేశాడు అఖిల్..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories