సన్నీనే విన్నర్.. శన్ను గెలిస్తే అది బిగ్ బాస్ గెలిపించినట్టే.. ఉమాదేవి సంచలన వ్యాఖ్యలు

Umadevi comments Sunny is the real Winner of Bigg Boss Telugu 5 but If Shanmukh Wins It Is Like BB Win him purposely
x

సన్నీనే విన్నర్.. శన్ను గెలిస్తే అది బిగ్ బాస్ గెలిపించినట్టే.. ఉమాదేవి సంచలన వ్యాఖ్యలు

Highlights

Umadevi - Bigg Boss Telugu 5 Winner: బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ఉమాదేవి బిగ్ బాస్ షోపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. రవి ఎలిమినేషన్ తరువాత...

Umadevi - Bigg Boss Telugu 5 Winner: బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ఉమాదేవి బిగ్ బాస్ షోపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. రవి ఎలిమినేషన్ తరువాత స్పందించిన ఆమె బిగ్ బాస్ షోపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిగ్ బాస్ గేమ్ చేంజ్ చేయడానికే అనవసరంగా రవిని బలి చేశారని ఆమె తెలిపింది. బిగ్ బాస్ ఓటింగ్ పై కూడా ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అనధికారిక ఓటింగ్ పోల్స్ లో రవి టాప్ 5 లో ఉన్నాడని.. మరి బిగ్ బాస్ అధికారిక పోలింగ్ లో రవికి ఎన్ని ఓట్లు వచ్చాయో మాత్రం ఇప్పటి వరకు తెలియదని ఉమాదేవి చెప్పుకొచ్చింది.

ఇక బిగ్ బాస్ 5 విన్నర్ విజె సన్నీ అని చెప్పిన ఆమె.. ఒకవేళ శన్ముఖ్ జస్వంత్ గెలిస్తే మాత్రం అది ప్రేక్షకులు గెలిపించినట్టు కాదని బిగ్ బాస్ కావాలని గెలిపించినట్టెనని ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక తరువాత వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా అర్ధం కావట్లేదని.. రవి ఎలిమినేషన్ షాక్ తో ఎప్పుడు ఎవరిని బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వెళ్తారో చెప్పడం కష్టమని ఉమాదేవి చెప్పుకొచ్చింది.

సిరి హనుమంత్, ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్ ముగ్గురిలో ఆర్జే కాజల్ టాప్ 5 లో ఉంటుందని తెలిపింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో జరిగే టాస్క్ లు ఒరిజినల్ అని.. కాని ఎలిమినేషన్ మాత్రం స్క్రిప్ లా ఉందేమోనని అనుమానం కలుగుతుందని ఉమా మీడియా ముఖంగా హాట్ కామెంట్స్ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories