Satyadev: 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' టీజర్ రిలీజ్

Satyadev: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య టీజర్ రిలీజ్
x
Highlights

'బాహుబలి' చిత్రం విజయం సాధించడం మాత్రమే కాదు.. టాలీవుడ్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమాని ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై తెరకెక్కించారు.

'బాహుబలి' చిత్రం విజయం సాధించడం మాత్రమే కాదు.. టాలీవుడ్ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ సినిమాని ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఈ సినిమా విజయం తరవాత ఈ సంస్థ మరో పెద్ద సినిమానే తెరకేక్కిస్తుందని అందరు అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా ఓ చిన్న సినిమాని తెరకేక్కిస్తోంది. 'కేరాఫ్‌ కంచరపాలెం' లాంటి విభిన్న కథా చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..' సినిమాని నిర్మిస్తోంది! మలయాళంలో మంచి హిట్ అయిన 'మహేశింతే ప్రతీకారమ్‌' చిత్రానికి ఇది రీమేక్‌..

అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. సినిమా మొత్తం గ్రామీణ నేపధ్యంలో సాగుతున్నట్టుగా తెలుస్తోంది. టీజర్‌లోని అన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉన్నాయి. జార్జిరెడ్డి నటన సినిమాకి మెయిన్ హైలెట్ కానుందని అర్ధం అవుతుంది. ఇందులో అతను ఓ ఫోటోగ్రాఫర్ గా కనిపించనున్నాడు. సీనియర్ నటుడు నరేష్ ముఖ్యపాత్ర పోషించారు. టీజర్ లోని సంగీతం, మాటలు బాగున్నాయి. 2020 ఏప్రిల్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories