పెద్ద సినిమాల వల్ల నలిగిపోతున్న చిన్న సినిమాలు

Two Small Budget Movies Postponed Due To Big Movies
x

పెద్ద సినిమాల వల్ల నలిగిపోతున్న చిన్న సినిమాలు

Highlights

Tollywood: పెద్ద సినిమాల వల్ల వాయిదా పడ్డ రెండు చిన్న బడ్జెట్ సినిమాలు

Tollywood: ఈ మధ్యకాలంలో థియేటర్లలో పెద్ద సినిమాల హవా బాగా నడుస్తోంది. వాయిదా పడ్డ భారీ బడ్జెట్ సినిమాలు అన్ని ఇప్పుడు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే "రాధేశ్యామ్", "భీమ్లా నాయక్", "ఆర్ఆర్ఆర్" వంటి పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలై కొన్ని డిజాస్టర్లుగా మరికొన్ని బ్లాక్ బస్టర్లుగా మారాయి. అయితే ఒక పెద్ద సినిమా విడుదల అయితే కనీసం రెండు వారాల పాటు చిన్న సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉండవు. అలా కాకుండా ఈ మధ్యనే విడుదలైన స్టాండప్ రాహుల్, మిషన్ ఇంపాజిబుల్, గని వంటి సినిమాలు డిజాస్టర్ లుగా మారాయి.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రెండు చిన్న బడ్జెట్ సినిమాలు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం విజయ్ హీరోగా నటించిన "బీస్ట్" మరియు "కే జి ఎఫ్" సినిమాలు థియేటర్లలో మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటున్నాయి. ఈ సమయంలో తమ సినిమా విడుదల అయినప్పటికీ కలెక్షన్లు అంతంతమాత్రంగానే ఉంటాయి అని అనుకున్న దర్శకనిర్మాతలు నాగ శౌర్య హీరోగా నటిస్తున్న "కృష్ణ వ్రిందా విహారి", మరియు విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న "అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమాలు వాయిదా వేశారు. ఒక ఏదైనా పెద్ద సినిమా విడుదల అయ్యాక కనీసం మూడు వారాల దాకా ఆ ఎఫెక్ట్ ఉంటుందని ఆ తర్వాతే ఈ సినిమా అయినా విడుదలైతే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు కూడా చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories