ఈ వారం విడుదల కాబోతున్న రెండు పాన్ ఇండియన్ చిత్రాలు

Two Pan Indian Films to Be Released This Week | Tollywood News
x

ఈ వారం విడుదల కాబోతున్న రెండు పాన్ ఇండియన్ చిత్రాలు

Highlights

ఈ వారం విడుదల కాబోతున్న రెండు పాన్ ఇండియన్ చిత్రాలు

Pan Indian Films: కరోనా కారణంగా వాయిదా పడ్డ పెద్ద సినిమాలన్నీ ఒకదాని తర్వాత మరొకటి బాక్సాఫీస్ వద్ద క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి రెండవ వారంలో బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో మొదటిది టాలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న "ఈ టి" కాగా మరొకటి ప్రభాస్ హీరోగా నటిస్తున్న "రాధేశ్యామ్". సూర్య మరియు ప్రియాంక అరుల్ మోహన్ హీరోహీరోయిన్లుగా పాండి రాజ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రం "ఈ టి". మార్చి 10న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

మరోవైపు చాలా కాలం తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రేమకథా చిత్రంగా "రాధేశ్యామ్" మార్చి 11 న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మొదటిసారిగా పూజా హెగ్డే ప్రభాస్ తో ఈ సినిమా తో రొమాన్స్ చేయనుంది. రాధాకృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య అని ఒక హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక అదే రోజున డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ధనుష్ హీరోగా నటించిన "మారన్" సినిమా విడుదల కాబోతోంది. మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఆది పినిశెట్టి నటించిన ఈ సినిమా మార్చి 11న నుంచి సోనీ లివ్ లో స్ట్రీమ్ కానుంది. రవితేజ హీరోగా ఈ మధ్యనే విడుదల అయిన "ఖిలాడి" కూడా మార్చ్ 11 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories