logo
సినిమా

Koratala Siva: ఆచార్య నుండి ఇంకా రెండు విడుదల అవ్వాలి అంటున్న కొరటాల

Two More Updates are There to Release From Acharya Movie Says Koratala Siva
X

ఆచార్య ట్రైలర్ గురించి చెప్పిన కొరటాల శివ (ఫైల్ ఇమేజ్)

Highlights

Koratala Siva: ఆచార్య ట్రైలర్ అద్భుతంగా ఉంటుంది అంటున్న డైరెక్టర్

Koratala Siva: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "ఆచార్య" సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుండగా, పూజా హెగ్డే రామ్ చరణ్ తో కథ కట్టనుంది. తాజా సమాచారం ప్రకారం డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా చిత్ర ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ సినిమా నుండి విడుదల చేయాల్సినవి ఇంకా రెండు ఉన్నాయి అని అన్నారు కొరటాల.

"ఒకటి చిరంజీవి గారు మరియు రామ్ చరణ్ కలిసి డాన్స్ చేసిన ఒక పాట మరొకటి సినిమా ట్రైలర్. ఈ సినిమా ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతోంది" అని అన్నారు కొరటాల శివ. రస్టిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో ఒక సోషల్ మెసేజ్ కూడా ఉండబోతోందట. రామ్ చరణ్ మరియు మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Web TitleTwo More Updates are There to Release From Acharya Movie Says Koratala Siva
Next Story