బోనీకపూర్‌ ఇంట్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

బోనీకపూర్‌ ఇంట్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్
x
Boney Kapoor (File Photo)
Highlights

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది తెలిసి రెండు రోజులు కూడా గడవకముందే బోనీకపూర్ ఇంట్లో పనిచేసే మరో ఇద్దరికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. వీరికి ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేకపోవడం గమనార్హం. బోనీ కపూర్ ముంబైలోని తన లోఖండ్‌వాలా ఇంటిలో కుమార్తెలు జాన్వి కపూర్ , ఖుషీ కపూర్‌లతో ఉన్నారు. వారు వైరస్ బారిన పడలేదని మీడియాకు ఇచ్చిన ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం ఆ ఇంట్లో మొదటి కేసు తెరపైకి వచ్చిన తరువాత, కుటుంబ సభ్యులందరిని ముందు జాగ్రత్త చర్యగా పరీక్షించారు. బోనీ కపూర్ మరియు అతని కుమార్తెలు జాన్వి కపూర్ , ఖుషీ కపూర్ కోవిడ్ -19 పరీక్ష ప్రతికూలంగా వచ్చింది. అయితే తమ ఆరోగ్యపై బోణి కపూర్ ప్రకటన విడుదల చేశారు..

అందులో ఇలా పేర్కొన్నారు.. 'నేను, నా పిల్లలు మరియు ఇంట్లో ఉన్న ఇతర సిబ్బంది అందరూ బాగానే ఉన్నారు.. మాలో ఎవరికీ లక్షణాలు చూపించడం లేదు. వాస్తవానికి, లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి మేము మా ఇంటిని వదిలి వెళ్ళలేదు. వేగంగా స్పందించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, బిఎంసికి కృతజ్ఞతలు. బిఎంసి , వారి వైద్య బృందం మాకు ఇచ్చిన సూచనలు మరియు సలహాలను మేము శ్రద్ధగా అనుసరిస్తాము.' అని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories