దిల్ రాజు రెండో వివాహానికి హాజరైన టాలీవుడ్ ప్రముఖులు వీళ్ళే?

దిల్ రాజు రెండో వివాహానికి హాజరైన టాలీవుడ్ ప్రముఖులు వీళ్ళే?
x
Highlights

టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిజామాబాదు లోని వేంకటేశ్వరస్వామి గుడిలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు రెండో వివాహాం చేసుకున్నారు.

టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిజామాబాదు లోని వేంకటేశ్వరస్వామి గుడిలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు రెండో వివాహాం చేసుకున్నారు. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులైన 20 మంది సమక్షంలో నిరాడంబరంగా ఈ పెళ్లి కార్యక్రమం జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకకి టాలీవుడ్ నుంచి ఎవరైనా హాజరయ్యారని మీడియా వర్గాలు ఆరా తీశాయి.

అయితే టాలీవుడ్ నుంచి ఈ పెళ్లికి ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే హాజరైనట్లు తెలిసింది. వారే అనిల్ రావిపూడి, హ‌రీశ్ శంక‌ర్ అంటున్నారు. సినీ పరిశ్రమలో వీరిద్ద‌రూ కూడా దిల్ రాజు అత్యంత ఆప్తులు కావడంతో ఆ ఇద్దరినీ ప్రత్యేకంగా ఆహ్వానించారనీ తెలుస్తోంది. అయితే దీని పైన క్లారిటీ రావాల్సి ఉంది.


టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ గా ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 సంవత్సరంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది.. అప్పటి నుంచి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నారు ఈ నేపథ్యంలో కూతురు , బంధువుల ఒత్తిడి మేరకు దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.

దిల్ రాజు రెండో భార్య విషయానికి వస్తే ఆమె పేరు తేజస్విని అని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈమె గతంలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసిందని, దిల్ రాజు కుటుంబానికి వారికి దగ్గర సంబంధాలు ఉన్నాయని సమాచారం. ఇక ప్రస్తుతం తెరకెక్కిస్తున్న వి సినిమా షూటింగ్ పూర్తి విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది.. నాని, సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories