OTT Movie: పాడెక్కాల్సిన వయసులో పెళ్లి.. తన బాయ్ ఫ్రెండ్ తో ప్రెగ్నెన్సీ.. ఇదేం సినిమా రా బాబు

OTT Movie: పాడెక్కాల్సిన వయసులో పెళ్లి.. తన బాయ్ ఫ్రెండ్ తో ప్రెగ్నెన్సీ.. ఇదేం సినిమా రా బాబు
x

OTT Movie: పాడెక్కాల్సిన వయసులో పెళ్లి.. తన బాయ్ ఫ్రెండ్ తో ప్రెగ్నెన్సీ.. ఇదేం సినిమా రా బాబు

Highlights

Tulip Fever Movie OTT: హిస్టారికల్ సినిమాలు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి. వాటి స్టోరీలు, రొమాంటిక్ సన్నివేశాలు, సస్పెన్స్‌తో కూడిన మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

Tulip Fever Movie OTT: హిస్టారికల్ సినిమాలు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తాయి. వాటి స్టోరీలు, రొమాంటిక్ సన్నివేశాలు, సస్పెన్స్‌తో కూడిన మలుపులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాంటి ఓ హాలీవుడ్ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా మూవీ ‘తులిప్ ఫీవర్’, 17వ శతాబ్దంలో జరిగే ఈ కథను ప్రేక్షకులకు అందిస్తోంది. 2017లో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి జస్టిన్ చాడ్విక్ దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రల్లో అలిసియా వికందర్, డేన్ డెహాన్, జాక్ ఓ’కానెల్, హాలిడే గ్రేంగర్, టామ్ హోలాండర్, మాథ్యూ మోరిసన్, కెవిన్ మెక్‌కిడ్, డగ్లస్ హాడ్జ్, జోవన్నా స్కాన్లాన్, జాచ్ గలిఫియానాకిస్ నటించారు. ఈ సినిమా ఆమ్‌స్టర్‌డామ్‌లోని 17వ శతాబ్దపు చిత్రకారుడి కథను ఆధారంగా తీసుకుంది.

‘తులిప్ ఫీవర్’ సినిమా కథ సోఫియా అనే ఆత్మహత్య చేసుకున్న ఒక అనాధ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక చర్చి నన్‌గా జీవిస్తుంది. ధనవంతుడైన కోర్నాలస్ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎంపిక చేసుకుంటాడు. కోర్నాలస్ వయసు ఎక్కువ, అతనికి ఇప్పటికే పెళ్లి అయి భార్య మరణించింది. సోఫియా, కోర్నాలస్‌తో వివాహం కాకుండా ఆర్టిస్ట్ అయిన జాన్‌తో ప్రేమలో పడిపోతుంది.

కానీ ఈ ప్రేమ కథలో మరో కీలక పాత్ర ఉంటుంది. కోర్నాలస్ దగ్గర మరియ అనే పనిమనిషి కూడా ఉంటుంది. ఆమె విలియం అనే వ్యక్తితో రహస్యంగా వ్యవహారం నడుపుతూ ఉంటుంది. ఆ కాలంలో తులిప్ పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. అక్కడ కొన్ని పూలు దొరికినా వాళ్లు ధనవంతులవుతారు. విలియం ఆ పూలను సంపాదించి, పెద్ద ధనవంతుడు అవ్వాలనుకుంటాడు. ఆ తర్వాత మరియాని పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు.

సోఫియా, జాన్‌తో ప్రేమలో పడినప్పటికీ, కోర్నాలస్‌కు తెలియకుండా తమ ప్రేమను కొనసాగిస్తారు. ఇక మరియా కూడా తన అనుకోని గమనంలో విలియంతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అయితే, విలియం కొంతకాలం కనబడకుండా పోతాడు. ఈ నేపథ్యంలో సోఫియా ఒక ఉపాయం ఆలోచిస్తుంది. మరియాను కోర్నాలస్‌కు తన బిడ్డని పుట్టించినట్లు నమ్మించి, అతనికి మోసం చేయడం మొదలుపెడుతుంది. ఈ కథ చివరికి ఆసక్తికరమైన మలుపుతో సాగుతుంది. కోర్నాలస్ ఈ మోసాన్ని తెలుసుకుంటాడా? సోఫియా, జాన్ ప్రేమ వివాహం చేసుకుంటారా ? విలియం మరియా కోసం తిరిగి వస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ‘తులిప్ ఫీవర్’ (Tulip Fever) సినిమాను తప్పకుండా చూడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories