Tuck Jagadish: ఈ తేదీన మన ముందుకు రాబోతున్న 'టక్ జగదీష్'

Tuck Jagadish Movie Releasing in OTT on 10th September
x

టక్ జగదీష్ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Tuck Jagadish: విడుదల కి సిదమైన 'టక్ జగదీష్

Tuck Jagadish: న్యాచురల్ స్టార్ నాని త్వరలో 'టక్ జగదీష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. "మజిలీ", "నిన్నుకోరి" వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి పోయినప్పటికీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇక థియేటర్లలో విడుదల చేయటం కంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయటం మంచిది అని దర్శక నిర్మాతలు ఈ సినిమా రైట్స్ ని భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వీడియో వారికి ఇవ్వటం జరిగింది.

అయితే ఈ సినిమా విడుదల తేదీ పై చాలా కాలంగా సస్పెన్స్ నడుస్తూ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 10 నుంచి స్ట్రీమ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాని తన లుక్ తో దృష్టిని ఆకర్షించాడు. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్లు ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలను కలిగించాయి. ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories