ఒక సినిమా కోసం రెండున్నర ఏళ్లు స్క్రిప్ట్ రాసిన త్రివిక్రమ్?

Trivikram  Srinivas Wrote a Script For Two And a Half Years for a Movie?
x

ఒక సినిమా కోసం రెండున్నర ఏళ్లు స్క్రిప్ట్ రాసిన త్రివిక్రమ్?

Highlights

Trivikram Srinivas: రెండున్నర ఏళ్లు త్రివిక్రమ్ స్క్రిప్ట్ తోనే బిజీగా ఉన్నారా

Trivikram Srinivas: ఎప్పుడో 2020 జనవరిలో "అల వైకుంఠపురంలో" సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తరువాత ఒక్క సినిమాకి కూడా దర్శకత్వం వహించలేదు. "అల వైకుంఠపురంలో" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న త్రివిక్రమ్ ఆ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమాని ప్రకటించారు. అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాలు తర్వాత ప్రేక్షకు ముందుకు రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే 2020 జనవరి నుంచి ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో పడ్డారు త్రివిక్రమ్ అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పటికి రెండున్నర ఏళ్లు పూర్తయింది కానీ స్క్రిప్ట్ మాత్రం ఇంకా పూర్తవలేదా అని అభిమానులు సైతం త్రివిక్రమ్ పై మండిపడుతున్నారు. అయితే ఇన్నేళ్లపాటు త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులలో బిజీగా లేరు.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "భీమ్లా నాయక్" సినిమా స్క్రిప్ట్ పనులు చూసుకున్న త్రివిక్రమ్ గతేడాది సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో తీవ్రంగా కలత చెందారు. దాని నుంచి తేరుకున్న త్రివిక్రమ్ ఆరు నెలల్లో మహేష్ బాబు సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి సినిమాని అనుకున్న తేదీకి విడుదల చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories