Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండ‌గే.. కొత్త సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా.? మ‌రోసారి మ్యాజిక్ రిపీట్

Jr NTR
x

Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండ‌గే.. కొత్త సినిమా డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా.? మ‌రోసారి మ్యాజిక్ రిపీట్

Highlights

Jr NTR: ఇంకా అధికారిక ప్రకటనలు రాకముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాల గురించి ఫిలింనగర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Jr NTR: ఇంకా అధికారిక ప్రకటనలు రాకముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాల గురించి ఫిలింనగర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మొదట వెంకటేష్‌తో సినిమా ఉంటుందని ప్రచారం మొదలైంది. దీని లాంచింగ్ వచ్చే నెల జరగవచ్చన్న సమాచారం లీక్స్ రూపంలో బయటపడింది. ఇదే సమయంలో రామ్ చరణ్‌తో ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు మెగా అభిమానుల్లో ఉత్సాహం రేపుతున్నాయి.

'పెద్ది' తర్వాత రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ RC17 ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో, త్రివిక్రమ్ దర్శకత్వంలో చరణ్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలు గంటల తరబడి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యాయి.

ఇంతలోనే మరో షాకింగ్ అప్డేట్ వచ్చేసింది. త్రివిక్రమ్ ముందుగా అల్లు అర్జున్‌తో ప్లాన్ చేసిన ఫాంటసీ సినిమాను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో చేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ఇంకా స‌మ‌యం ఉంది. ప్ర‌స్తుతం వార్‌2 షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఆ త‌ర్వాత ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్ట్, 'దేవర 2స సినిమాలు ఉన్నాయి. అటుపై నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో ఒక మూవీ ఉండొచ్చన్న సంకేతాలు సితార సంస్థ నుంచి వస్తున్నాయి. ఇదిలా ఉండగానే, ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ ప్రచారంలోకి వచ్చింది.

ఈ లెక్క‌న చూసుకుంటే ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రావాలంటే క‌నీసం రెండేళ్ల‌యినా ఆగాల్సిందే. అటు త్రివిక్ర‌మ్ సైతం వెంక‌టేష్‌, రామ్ చ‌ర‌ణ్ సినిమాల‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఇవ‌న్నీ పూర్త‌యిన త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా ఉండ‌నుంద‌ని వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి వీటిలో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories