Trivikram Srinivas: నా కథతో సినిమా తీశాడు.. త్వరలో త్రివిక్రమ్‌కి లీగ‌ల్ నోటీసులు!

Trivikram Srinivas: నా కథతో సినిమా తీశాడు.. త్వరలో త్రివిక్రమ్‌కి లీగ‌ల్ నోటీసులు!
x
Highlights

తాజాగా సంక్రాంతి కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో అల వైకుంఠపురములో అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

తాజాగా సంక్రాంతి పండగ కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 'అల వైకుంఠపురములో' అనే సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ పై తెరకెక్కిన ఈ చిత్రం 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అల్ టైం ఇండస్ట్రీగా నిలిచింది. అంతేకాకుండా కొన్ని చోట్లలో నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ కథ తనదని, దర్శకుడు త్రివిక్రమ్ దానిని కాపీ కొట్టాడంటూ కృష్ణ అనే దర్శకుడు లీగల్ కేస్ నమోదు చేశాడు.

చిన్న చిన్న చిత్రాల‌కి ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్న కృష్ణ అనే ద‌ర్శకుడు ఈ సినిమా కథని 2005లో త్రివిక్రమ్‌ని క‌లిసి స్టోరీని న‌రేట్ చేశాడ‌ట‌. అంతేకాకుండా 2013లో ఈ క‌థ‌ని ఫిలిం ఛాంబ‌ర్‌లో రిజిస్టర్ కూడా చేసుకున్నాడ‌ట‌. త‌న స్క్రిప్ట్ ఫ‌స్ట్ పేజ్ కాపీని త్రివిక్రమ్‌కి ఇచ్చాన‌ని, దీనినే త్రివిక్రమ్ అల వైకుంఠపురములో అనే టైటిల్ తో తెరకెక్కించాడని అంటున్నాడు. ఇదే కథని తానూ 'దశ దిశ' అనే టైటిల్‌తో తెరకెక్కించాలనుకున్నానని చెప్పుకొచ్చాడు. త్వరలో త్రివిక్రమ్ కి లీగల్ నోటీసులు కూడా పంపిస్తానని కృష్ణ పేర్కొన్నాడు..

అయితే దీనిపైన త్రివిక్రమ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా విడుదలైన నెలకి ఈ విషయం గుర్తుకు వచ్చిందా అని కామెంట్స్ పెడుతున్నారు. గతంలోనూ కూడా త్రివిక్రమ్ కి ఇలాంటివి ఎదురయ్యాయి. అజ్ఞాతవాసి సినిమా సమయంలో లార్గో వించ్ దర్శకుడు త్రివిక్రమ్ పై విమర్శలు చేశాడు. ఇక అ.. ఆ సినిమాను మీనా అనే నవలను అచ్చుగుద్దినట్లు దింపేసాడు. కనీసం ఆ నవల రచయిత యద్దనపూడి సులోచనారాణి పేరు కూడా వేయలేదన్న విమర్శలు వచ్చాయి. అ ఆతర్వాత ఆమె పేరు వేయడంతో విషయం సద్దుమణిగింది. ఇక అరవింద సమేత వీర రాఘవ విషయంలోనూ ఇదే జరిగింది. వేంపల్లి గంగాధర్ అనే రచయిత నా కథను వాడుకున్నాడని ఆరోపణలు చేశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories