నాలుగోసారి త్రివిక్రమ్, అల్లు అర్జున్

నాలుగోసారి త్రివిక్రమ్, అల్లు అర్జున్
x
Trivikram, Allu arjun
Highlights

త్రివిక్రమ్‌ - అల్లు అర్జున్‌ మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇది.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో'...

త్రివిక్రమ్‌ - అల్లు అర్జున్‌ మంచి సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఇది.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి. అయితే ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి జతకట్టనుంది. అయితే అది సినిమా కోసం కాదులెండి! ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ 'అహ' పేరుతో డిజిటల్‌ ప్లాట్‌ఫాం ప్రారంభించిన సంగతి తెలిసిందే..దీనిని ఈ మధ్యనే ప్రారంభించారు. అయితే బన్నీతో ప్రమోషన్‌ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నరాట! ఇందులో అల్లు అర్జున్ కి సంబంధించిన సన్నివేశాలను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్నారట! త్వరలో షూట్ ప్రారంభంకానుందని తెలుస్తోంది.

తాజాగా 'అల వైకుంఠపురములో' సినిమాతో మంచి హిట్టు కొట్టిన త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఈ సినిమాకి 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు . ఇక ఇప్పటికే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ అనే చిత్రం వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. మళ్ళీ ఈ కాంబినేషన్ రీపీట్ అవుతుండడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఇక ఈ అల వైకుంఠపురములో సినిమా తరవాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ తో చేస్తున్నాడు.. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆర్య, ఆర్య 2 లాంటి సినిమాల తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాదికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories