Top
logo

రూల్స్ బ్రేక్.. టాలీవుడ్‌ హీరోకు ఫైన్‌

రూల్స్ బ్రేక్.. టాలీవుడ్‌ హీరోకు ఫైన్‌
X
Highlights

రూల్స్ బ్రేక్ చేసినందుకు టాలీవుడ్ హీరో నాగశౌర్యకు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. నాగశౌర్య...

రూల్స్ బ్రేక్ చేసినందుకు టాలీవుడ్ హీరో నాగశౌర్యకు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ ఉండటంతో పంజాగుట్ట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రవి రూ. 500ల ఫైన్‌ విధించారు. అనంతరం కారు అద్దాలకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌ను పోలీసులు తొలగించారు. ఈ ఘటన మంగళవారం బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 1లో చోటుచేసుకుంది. కారులో ఉన్న మనిషి కనిపించకుండా కారు విండోలకు బ్లాక్ ఫిల్మ్ లను పెట్టుకోవడం సెంట్రల్ మోటార్ వెహికిల్ నిబంధనలు, సుప్రీంకోర్టు రూల్-2012 ఉల్లంఘన కిందికి వస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించడం తప్పనిసరి.Next Story