Toxic Teaser : రాకింగ్ స్టార్ 'రక్తపాతం' మొదలు.. టీజర్‌తో విశ్వరూపం చూపించనున్న యష్!

Toxic Teaser : రాకింగ్ స్టార్ రక్తపాతం మొదలు.. టీజర్‌తో విశ్వరూపం చూపించనున్న యష్!
x

 Toxic Teaser : రాకింగ్ స్టార్ 'రక్తపాతం' మొదలు.. టీజర్‌తో విశ్వరూపం చూపించనున్న యష్!

Highlights

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'కేజీఎఫ్' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'కేజీఎఫ్' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యష్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన తదుపరి చిత్రం ‘టాక్సిక్’తో బాక్సాఫీస్ వద్ద అసలు సిసలు విశ్వరూపం చూపించడానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా టీజర్ అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు మేకర్స్.

తేదీ ఫిక్స్..

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ టీజర్‌ను ఫిబ్రవరి 20న (రేపు) ఉదయం 9:35 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌డేట్ కోసం విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటేనే ప్రేక్షకులకు గూస్‌బంప్స్ వస్తున్నాయి. మంచు కురుస్తున్న ప్రాంతంలో యష్ ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఆల్కహాల్ తాగుతుంటే, ఆయన ముందర మాత్రం రక్తం ఏరులై పారుతోంది. శాంతిగా ఉన్న రాక్షసుడు మేల్కొంటే ఎలా ఉంటుందో ఈ పోస్టర్ అద్దం పడుతోంది.

ఈ చిత్రానికి ‘A Fairy Tale for Grown-ups’ అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్ ఇచ్చారు. 1970ల నాటి గోవా డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా, రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కేవలం యష్ కోసమే కాదు, ఇందులో నటిస్తున్న భారీ తారాగణం వల్ల కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.నయనతార కీలక పాత్రలో మెరవనుండగా..కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి వంటి స్టార్ హీరోయిన్లు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.వీరి పాత్రలు కథలో ఎంతో కీలకంగా ఉండబోతున్నాయని, ముఖ్యంగా నయనతార-యష్ కాంబినేషన్ వెండితెరపై మ్యాజిక్ చేయబోతుందని టాక్.

షూటింగ్ లొకేషన్లు మరియు ఇతర అంశాలపై గతంలో కొన్ని వివాదాలు తలెత్తినప్పటికీ, మేకర్స్ అవేమీ లెక్కచేయకుండా సినిమాను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేస్తున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.రేపు విడుదల కాబోయే టీజర్, రాఖీ భాయ్ మేనియాను మించిపోయి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. సిద్ధంగా ఉండండి.. టాక్సిక్ రక్తపాతం మొదలవ్వబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories