
Toxic Movie: కన్నడ రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ క్రేజ్ నెలకొంది.
Toxic Movie: కన్నడ రాకింగ్ స్టార్ యష్, గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ క్రేజ్ నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ బిజినెస్
యష్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు సమాచారం. ఆంధ్రా, నైజాం, సీడెడ్ కలిపి తెలుగు థియేట్రికల్ రైట్స్ సుమారు 40 కోట్ల రూపాయలకు డీల్ కుదిరినట్లు టాక్. ఈ లెక్కన తెలుగులో ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే కనీసం 82 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. సమ్మర్ రేసులో మార్చి 19న విడుదలవుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఒకవైపు అంచనాలు పెంచగా, మరోవైపు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. తుపాకీ కాల్పులు, స్మశానం వంటి సీరియస్ బ్యాక్‌డ్రాప్‌లో హీరో ఒక విదేశీ భామతో కారులో రొమాన్స్ చేసే 'ఇంటిమేట్ సీన్'పై మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై మహిళా కమిషన్ సెన్సార్ బోర్డును వివరణ కోరింది. అయితే, ఇది కేవలం యూట్యూబ్‌లో విడుదల చేసిన గ్లింప్స్ మాత్రమేనని, థియేటర్లో రిలీజ్ అయ్యే కంటెంట్ కానందున దీనికి సెన్సార్ బోర్డ్ అనుమతి అవసరం లేదని సీబీఎఫ్‌సీ తేల్చి చెప్పడంతో వివాదం ప్రస్తుతానికి సద్దుమణిగింది.
ఈ సినిమాలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, రుక్మిణీ వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. రవి బస్రూర్ సంగీతం, రాజీవ్ రవి విజువల్స్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. యాక్షన్, వయలెన్స్, రొమాన్స్ కలగలిపిన 'టాక్సిక్'తో యష్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి తెలుగులో నిర్ణయించిన ఈ భారీ టార్గెట్‌ను రాకీ భాయ్ అందుకుంటాడా? లేదా? అనేది మార్చి 19న తేలనుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




