Top
logo

గూగుల్‌ను షేక్‌ చేసిన టాప్ టెన్ సినిమాలు ఇవే!

గూగుల్‌ను షేక్‌ చేసిన టాప్ టెన్ సినిమాలు ఇవే!
X
Highlights

పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

పాత సంవత్సరానికి గుడ్ బై చెబుతూ నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో అన్ని రంగాల వాళ్లు ఈ ఏడాదిలో జరిగిన స్వీట్ మెమోరీస్, హాట్ మెమోరీస్ ను గుర్తు చేసుకుంటున్నారు. బిజినెస్ గురించి, సినిమా గురించి, ఏ రంగంలో నైనా 2019 యాదిలో అంటూ ఈ ఏడాది జరిగిన విషయాలను గురించి చర్చించుకుంటారు.

ఇక ఇప్పుడు గూగుల్ కూడా ఇదే పనిలో నిమగ్నమైంది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా ప్రజలు గూగుల్ లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన పది సినిమాలను గుర్తించి జాబితాను విడుదల చేసింది. గూగుల్‌ ఇండియా విడుదల చేసిన ఈ లిస్ట్‌లో 7 బాలీవుడ్‌, 3 హాలీవుడ్‌ సినిమాలు ఉండగా ఒక్క సౌత్‌ సినిమాకు కూడా చోటు దక్కలేదు. ఇది సౌత్ సినిమా రంగానికి బ్యాడ్ లక్ గానే చెప్పుకోవచ్చు.

ఇక ఈ టాప్ టెన్ లో ఉన్న సినిమాల గురించి తెలుసుకుందాం.

టాప్‌ 1లో కబీర్‌సింగ్‌

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో షాహిద్ కపూర్‌, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమాకు కబీర్ సింగ్. ఈ సినిమా లిస్ట్‌లో టాప్‌1 ప్లేస్‌లో నిలిచింది. తెలుగు తెరపై విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటించిన లవ్ స్టోరీ అర్జున్ రెడ్డి. ఈ సినిమానే రీమేక్ చేసి హిందీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించారు. ఈ సినిమా టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్‌ లో కూడా బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపింది. ఈ సినిమా తెరకెక్కిన తరువాత ఎన్నో వివాదాలు తెరకెక్కాయి. అయినా ఎక్కడా తగ్గక భారీ వసూళ్లను సాధించింది బాక్సాఫీస్ ను బద్దలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ వివాదాల కారణంగానే మోస్ట్ సెర్డ్చ్‌ లిస్ట్‌లో టాప్‌లో నిలిచిందని చెప్పుకోవొచ్చు‌.

రెండో స్థానంలో అవెంజర్స్‌ - ఎండ్‌ గేమ్‌

అవెంజర్స్ - ఎండ్ గేమ్ అనేది మార్వెల్ కామిక్స్ లోని ఒక సూపర్ హీరో బృందమైన ది ఎవెంజర్స్ ను ఆధారంగా తీసుకుని రూపొందించిన అమెరికన్ సూపర్హీరో చిత్రం. దీనిని మార్వెల్ స్టూడియోస్ నిర్మించగా, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పంపిణీ చేసింది.

అవెంజర్స్‌ సిరీస్‌లో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా చిన్నపిల్లలను, పెద్దవారిని ఆకట్టుకునే యాక్షన్ మూవీ. అవేంజర్స పార్ట్ లో ఈ చిత్రం ఆఖరిది కావడంతో భారత్‌లో కూడా చాలా క్రేజ్‌ వచ్చింది. దీనికితోడు ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లోనూ విడుదలైంది. కేవలం భారత్‌లోనే 373 కోట్ల వసూళ్లు చేసి బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. దీంతో అవెంజర్స్‌ ఎండ్‌గేమ్‌ టాప్ టెన్ సినిమాలో స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ మూవీ చివరిది కావడంతో తమ ఫేవరెట్‌ హీరోలు ఇక వెండితెర మీద కనిపించరనుకున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విశేషాలు తెలుసుకునేందుకు నెటిజెన్లు కొంత ఎక్కువ ఉత్సాహాన్నే కనబరిచారని చెప్పింది గూగుల్ ఇండియా సంస్థ.

టాప్ 3 లో హాలీవుడ్‌ మూవీ జోకర్

సెన్సేషన్‌ సృష్టించిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం జోకర్‌ ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి హాలీవుడ్ కి మంచి టాక్ వచ్చింది. DC కామిక్స్ పాత్రల ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రంలో జోక్విన్ ఫీనిక్స్ జోకర్‌గా నటించి తన హావ భావాలను తెరకెక్కించారు. ఈ సినిమా గురించి మంచి టాక్‌ రావటంతో సినిమా విశేషాలను తెలుసుకోవానుకున్నారు ప్రేక్షకుల. దీంతో ఎక్కువ శాంతో గూగుల్ సెర్చ్ చేసి సినిమా విశేషాలను తెలుసుకున్నారు. అంతే కాదు సక్సెస్‌, వసూళ్ల పరంగా కూడా జోకర్‌ తన సత్తా చాటుకుంది. దీంతో ఈ సినిమా అత్యధిక మంది అన్వేషించిన చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకుంది.

నాలుగో స్థానంలో కెప్టెన్‌ మార్వెల్‌

అన్నా బోడెన్, ర్యాన్ ఫ్లెక్ దర్శకత్వంలో బ్రీ లార్సన్, శామ్యూల్ ఎల్. జాక్సన్, బెన్ మెండెల్సోన్, జూడ్ లా, అన్నెట్టింగ్ బెనింగ్ లు నటించిన మరో క్రేజీ హాలీవుడ్‌ మూవీ కెప్టెన్‌ మార్వెల్‌. ఈ సినిమా ముఖ్యంగా కరోల్ డాన్వర్స్ (బ్రీ లార్సన్) అనే ఒక లేడీ పైలట్ ని ఆధారంగా తీసిన మూవీ. ఈ సినిమాని కూడా భారతీయులు బాగానే ఆదరించారు. ఈ సినిమాలో కెప్టెన్ కి కొన్ని శక్తులను కలిగి ఉంటుంది. కానీ ఆ శక్తులను ఏ విధంగా ఉపయోగించాలో తెలీక ఆమె సతమతమవుతుంది. తన శక్తులను ఏ విధంగా ఉపయోగిస్తుందో తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగానే ఫాలో అయ్యారు. అంతే కాదు ఈ ఏడాది హాలీవుడ్‌ చిత్రాలన్ని ప్రాంతీయ భాషల్లో రిలీజ్‌ కావటం వాటికి కలిసొచ్చింది. అందుకే హాలీవుడ్‌ సినిమాల విశేషాల కోసం కూడా భారతీయులు గూగుల్‌లో భారీగా సెర్చ్‌ చేశారు. దీంతో ఈ సినిమా నాలుగో స్థానంలో నిలిచింది.

ఐదో స్థానంలో సూపర్‌ 30

ప్రముఖ మేథమెటీషియన్‌ ఆనంద్ కుమార్ జీవిత కథ ఆదారంగా వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన సినిమా సూపర్‌ 30. ఈ సినిమాలో బాలీవుడ్‌ సూపర్‌ హీరో హృతిక్‌ రోషన్‌ హీరోగా నటించారు. మేథమెటీషియన్‌ ఆనంద్ కుమార్ పాత్రలో జీవించారు. అంతే కాదు ఈ సినిమాలో హృతిక్‌ లుక్‌, హావా భావాలు హృతిక్ ష్యాన్స్ ను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్‌ ను సంపాదించింది. దీంతో హృతిక్ ష్యాన్స్ సినిమా విశేషాల గురించి గూగుల్‌ లో బాగానే ఫాలో అయ్యారు. దీంతో ఆ సినిమా లిస్ట్‌లో ఐదో ప్లేస్‌ సంపాదించింది.

ఆరో స్థానంలో మిషన్‌ మంగల్‌

బాలీవుడ్‌ హిట్ మెషీన్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ ఏడాది కూడా తన ఫాం కొనసాగించాడు. జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతీయ హిందీ- భాషా నాటక చిత్రం. వరుసగా సందేశాత్మక ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్న అక్షయ్‌ మరోసారి అదే బాటలో చేసిన సినిమా మిషన్‌ మంగళ్‌. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ , విద్యాబాలన్ , తాప్సీ పన్నూ , నిత్యా మీనన్ , కీర్తి కుల్హారీ , షర్మాన్ జోషి , హెచ్ జి దత్తాత్రేయ , విక్రమ్ గోఖలే , మరియు సోనాక్షి సిన్హా నటించారు . ఈ చిత్రం భారత అంతరిక్ష పరిశోధన యాత్ర అయిన మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు సహకరించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తల జీవితంపై ఆధారపడింది. అందుకే ఈ మూవీ గూగుల్‌లో అత్యధిక మంది శోధించిన జాబితాలో ఆరో స్థానం సాధించింది.

గల్లీ బాయ్‌కి సెవెన్త్‌ ప్లేస్‌

బాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ రణవీర్‌ సింగ్‌. జాయ్‌ అక్తర్‌ దర్శకత్వంలో రణవీర్‌ హీరోగా తెరకెక్కిన సినిమా గల్లీ బాయ్‌. ఈ సినిమాకి కూడా ఈ లిస్ట్‌లో స్థానం దక్కడం విశేషం. ఈ సినిమా మొస్ట్‌ సెర్డ్చ్‌ లిస్ట్‌లో ఏడో స్థానంలో నిలిచింది. రణవీర్‌ సరసన అలియా భట్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బెస్ట్ ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిలిం కేటగిరిలో ఆస్కార్‌కు కూడా నామినేట్ అయ్యింది. దీంతో రణవీర్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు.

ఎనిమిదో స్థానంలో వార్‌

సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా సినిమా వార్. ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కింది‌. ఈ సినిమాకు హైప్‌ అయితే క్రియేట్‌ అయ్యింది. దీంతో నెటిజన్లు ఈ సినిమా విశేషాలు తెలుసుకునేందుకు ఆసక్తిని చూపించారు. ఈ సినిమా విశేషాలను తెలుసుకోవడానికి అత్యధిక మంది శోదించిన లిస్ట్‌లో స్థానం సంపాదించింది. అంతే కాదు ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లోనూ స్థానం ఈ సినిమాకు ప్లేస్ దక్కింది.

కామెడీ ఎంటర్‌టైనర్‌కు నైన్త్‌ ప్లేస్‌

మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ హౌజ్‌ఫుల్‌ సిరీస్‌లో ఫర్హాద్‌ సాజమీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హౌజ్‌ఫుల్ 4. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, బాబీడియోల్, రితేష్ దేశ్‌ముఖ్, కృతి కర్బందా, పూజా హెగ్డే నటించారు. వారిదైన శైలిలో కామెడీని రక్తి కట్టించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైనప్పటికీ గూగుల్‌ మోస్ట్ సెర్డ్చ్‌ ఖాతాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.ఈ సినిమా దాదాపు 200 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హాయిగా కాసేపు నవ్వుకోవచ్చు.

లాస్ట్ బట్‌ నాట్‌ ద లీస్ట్‌ - ఉరి సర్జికల్‌ స్ట్రైక్‌

భారత సైనికులు పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై చేసిన సర్జికల్‌ స్ట్రైక్‌ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఉరి సర్జికల్‌ స్ట్రైక్‌. ఈ సినిమాని ఆదిత్య థర్‌ దర్శకత్వంలో తెరకెక్కించారు. భారత సైనికుల గురించి వారు దేశం గురించి ఏ విధంగా పాటుపడుతున్నారో, వారి ప్రాణాలను దేశం గురించి ఎలా త్యాగం చేస్తున్నారో ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రంలో విక్కీ కౌశల్‌ హీరోగా నటించాడు. 2019లో భారత్‌లో అత్యధిక మంది శోదించిన చిత్రాల జాబితాలో పదో స్థానంలో నిలిచింది.Web TitleTop 10 Most Searched Movies on Google
Next Story