ఈ దశాబ్దం లో ప్రేక్షకుల మదిని దోచిన పాటలు ఇవే!

ఈ దశాబ్దం లో ప్రేక్షకుల మదిని దోచిన పాటలు ఇవే!
x
Highlights

ఏదైనా సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది పాటలే! సినిమాలో పాటలు ఎలా ఉన్నాయి అనే అంశం పైనే సినిమా ఓపెనింగ్స్ ఆధార పది ఉంటాయన్నది...

ఏదైనా సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది పాటలే! సినిమాలో పాటలు ఎలా ఉన్నాయి అనే అంశం పైనే సినిమా ఓపెనింగ్స్ ఆధార పది ఉంటాయన్నది టాలీవుడ్ నమ్మకం. నమ్మకమేమిటి.. దాదాపుగా పాటల నిజం కూడాను. సూపర్ హిట్టైన సినిమాల్లో పాటల పాత్ర ఎక్కువ శాతం ఉంటుంది.

తెలుగు సినిమా పాత మెలోడీ నుంచి డిస్కో, బ్రేక్, ఫోక్, ఇలా అన్ని రకాల పాటల్నీ కలగలిపి వదిలేస్తుంటారు మన సంగీత దర్శకులు. ప్రతి సంవత్సరం విడుదలయ్యే వందలాది సినిమాల్లో కొన్ని పాటలు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. కొన్ని సినిమాలు ఒక్క పాత కోసమే హిట్ మెట్టు ఎక్కిన సందర్భాలూ ఉంటాయి.

ఈ దశాబ్దంలో ఎన్నో హిట్టు పాటలు తెలుగు తెరను పలకరించాయి. ఈ దశాబ్ది ముందు వరకూ పాటకు కొలమానం ఆయా సినిమాల ఆడియో అమ్మకాలే. తరువాత ఆ తీరు మారింది. యూట్యూబ్ వచ్చిన తరువాత ఆ కొలమానాలన్నీ మారిపోయాయి. యూట్యూబ్ లో ఎన్ని హిట్ లు వచ్చాయన్నదే లెక్క. ఆ లెక్కల్లో ఈ దశాబ్దిలో టాప్ లో నిలిచిన పాటల్లో అధిక భాగం మెలోడీ పాటలు కావడం గమనార్హం. వేగవంతమైన జీవితంలో రణగొణ ధ్వనులతో స్పీడు ఉన్న పాటల కంటే మెలోడీ పాటలే అందరి మనసులు దోచుకుంటున్నాయి. అలా యూట్యూబ్ లో ప్రేక్షకుల అభిమానాన్ని కొల్లగొట్టిన టాప్ 10 పాటల గురించి ఒక్కాసారి చూద్దాం..

నెంబర్ 1..

వచ్చిండే..పిల్లా మెల్లగా వచ్చిండే ..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలోని ఈ పాట అన్నితరాల మనసుల్నీ దోచేసింది. సింగర్ గా మధుప్రియకు గోల్డెన్ పాటగా నిలిచి పోయింది. ఈ పాటలో అన్ని అంశాలు కుదిరాయి. శక్తి కాంత్ కార్తీక్ స్వరపరచిన ఈ పాటను సుద్దాల అశోక్ తేజ్ రాశారు. ఈ పాట లో ఉన్న బిస్కట్ వేసిండే అన్న పదం ట్రేండింగ్ అయిపొయింది. ఇక సాయిపల్లవి డాన్స్ ఈ పాటను మరో లెవెల్ కి తీసుకు వెళ్లడంతో ఈ పాట లక్షలాది లైకులు లాగేసింది.

నెంబర్ 2 ..

రంగమ్మా మంగమ్మా.. రంగస్థలం!

రామ్ చరణ్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా రంగస్థలం.. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం పెద్ద ఆకర్షణగా నిలిచింది. ఇందులో పాటలన్నీ హిట్టే. వాటిలో రంగమ్మా..మంగమ్మ పాట ఇప్పటికీ ట్రేండింగ్ లోనే ఉంది. చంద్రబోస్ రాసిన ఈ పాట ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో న్యాచురాలిటీకి దగ్గరగా ఈ పాట చిత్రీకరించారు.

నెంబర్ 3 ...

ఇంకేం ఇంకేం కావాలె.. గీతాగోవిందం!

సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట యూత్ లో విపరీతంగా ట్రెండ్ అయింది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాట కూడా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. మెలోడీ పాటగా చక్కని గుర్తింపు పొందింది.

నెంబర్ 4 :

పిల్లాడా.. RX 100 :

అదోరకం సినిమా గా యువతను ఆకట్టుకున్న సినిమా ఇది. సినిమా అంతా అడల్ట్ కంటెంట్ తో ఉంటుంది. అయితే, ఈ పాట కూడా ఏం తక్కువ కాదు. కానీ, ఈ పాట కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంది. యూట్యూబ్ లో దుమ్ము దులిపింది.

నెంబర్ 5 :

సాహోరే బాహుబలి!

బాహుబలి సినిమా భారత సినిమా రేంజిని ప్రపంచానికి చూపించిన సినిమా ఇది. రెండు భాగాలుగా రాజమౌళి చెక్కిన ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. అయితే, రెండు భాగాలకూ కలిపి ఈ ఒక్క పాటే యూట్యూబ్ లో బాగా పాప్యులర్ అయింది. కేరవాణి సంగీతంలో వచ్చిన ఈపాట అదరగొట్టింది.

నెంబర్ 6 :

సీటీ మార్.. దువ్వాడ జగన్నాధం..

సీటీ మార్ పాటకి అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు ప్రేక్షకులతో విజిల్స్ వేయించాయి. దీంతో ఈ పాట ట్రెండ్ అయింది. పాటలో బీట్ కి తగ్గట్టుగా ఉన్న డ్యాన్స్ పాటని మరో లెవెల్ లో నిలబెట్టింది.

నెంబర్ 7 :

చూసీ చూడంగానే నచ్చేశావ్.. చలో!

చూసీ చూడంగానే నచ్చేశావ్ అంటూ యువ హీరో నాగశౌర్య మెలోడియస్ గా హీరోయిన్ కి చెప్పిన మాటలు పాటల రోపంలో వినగానే నాచ్చాసాయి అన్నారు ప్రేక్షకులు. మెలోడియస్ పాటకి.. అంత కంటే అందమైన చిత్రీకరణ అద్భుతంగా నిలిచింది. దీంతో టాప్ టెన్ లో చోటు సంపాదించుకుంది.

నెంబర్ 8 :

జిగేలు రాణి.. రంగస్థలం!

రంగస్థలం సినిమా కథ, కథనానికి పాటలూ బలం తీసుకువచ్చాయి. మాస్ పాట ఉంటేనే గానీ ఈ సినిమాకి కుక్కడరాదని దేవీ, సుకుమార్ ఫిక్స్ అయ్యారు. దాంతో ఈ పాట తెరకెక్కింది. అనకాపల్లి లో వెంకట లక్ష్మి అనే ఆవిడ పాడిన ఈ పాట ప్రేక్షకులకు విపరీతమైన కిక్ ఇచ్చింది.

నెంబర్ 9 :

ఏం చెప్పను..నేను శైలజా..

ప్రేక్షకులు మెచ్చిన మరో మెలోడీ ఇది. నేను..శైలజ సినిమా హిట్ లో ఈ సాంగ్ దీ ప్రత్యేక స్థానమే.

నెంబర్ 10 :

ఏవండోయ్ నానీ గారు..ఎంసీఏ!

నానీ హీరాగా వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో సాహిపల్లవి మళ్ళీ తన మార్క్ డ్యాన్స్ తో హెట్ కొట్టిన పాట ఇది. పాట ఎంత బావుంటుందో సాయిపల్లవి అభినయమూ అంత బావుంటుంది. దాంతో టాప్ 10 లో పాగా వేసేసిందివో.

ఇంకా ఇవి కాకుండా చాలా పాటలు ప్రేక్షకులను ఈ పదేళ్లలో గిలిగింతలు పెట్టాయి. అయితే యూట్యూబ్ పరంగా టాప్ పది పాటల్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఇటీవల ట్రేండింగ్ లో దూసుకుపోతున్న అలవైకుంఠపురం రాములో రాములా పాట సినిమా విడుదల కానందున పరిగణన లోకి తీసుకోలేదు. దాంతో పాటు అదే సినిమాలోని సామజవరా గమనా కూడా ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉంది.












Show Full Article
Print Article
Next Story
More Stories