Kantara: రిషబ్ శెట్టి దర్శకత్వంలో రామ్ చరణ్..

Rishab Shetty: టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి దర్శకత్వం వహించనున్న రిషబ్ శెట్టి

Jyothi
Updated on: 23 Oct 2022 4:11 PM IST
Tollywood Star Hero will be Directed by Rishab Shetty
X

రిషబ్ శెట్టి దర్శకత్వంలో రామ్ చరణ్

Rishab Shetty: ఈ మధ్యనే విడుదలైన "కాంతారా" సినిమా అటు కన్నడలో మాత్రమే కాక తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే రాసిన రిషబ్ శెట్టి స్వయంగా సినిమాకి దర్శకత్వం కూడా వహించారు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల వసూళ్లను నమోదు చేసుకుని కన్నడలో మాత్రమే కాక ఈ సినిమా మిగతా సౌత్ ఇండియన్ భాషల్లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు.

ఈ సినిమాతో అల్లు అరవింద్ భారీ లాభాలు అందుకున్నారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టితో మరొక సినిమా సైన్ చేశారు అల్లు అరవింద్. అయితే ఈసారి రిషబ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమా చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రిషబ్ సినిమా అల్లు అరవింద్ కు నేరేట్ చేశారు. రామ్ చరణ్ కూడా విని ఓకే చెప్తే సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Jyothi

Jyothi

Next Story