జాన్వి కపూర్ తో రొమాన్స్ చేయనున్న టాలీవుడ్ స్టార్ హీరో

Tollywood star hero to have romance with Janvi Kapoor
x

జాన్వి కపూర్ తో రొమాన్స్ చేయనున్న టాలీవుడ్ స్టార్ హీరో

Highlights

Tollywood: త్వరలో "ఆర్ఆర్ఆర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ "ఉప్పెన" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు సన డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు.

Tollywood: త్వరలో "ఆర్ఆర్ఆర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ "ఉప్పెన" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బుచ్చి బాబు సన డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి జాన్వికపూర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలోనే నటించాల్సి ఉంది. కానీ ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు.

కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని పొందింది ఈ భామ. మరో వైపు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా త్వరలో సెట్స్పైకి వెళ్లనున్న "జనగణమన" సినిమా కోసం కూడా జాన్వికపూర్ నీ హీరోయిన్ పాత్ర కోసం సంప్రదించారట. మరి ఈ సినిమాకి ఆమె యస్ చెబుతుందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న జాన్వీకపూర్ టాలీవుడ్ లో ఒక సైతం అడుగుపెట్టాలని ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ తో సినిమా అంటే తెలుగులో కూడా ఈమెకు మంచి డెబ్యూ దొరికినట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories